కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. 

న్యూఢిల్లీ: ఉపాధికి ఎన్నో అవకాశాలను ఈ బడ్జెట్ కల్పిస్తుందని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం నాడు పార్లమెంట్ లో  మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ పై  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.  

 

Scroll to load tweet…

అందరి అవసరాలు తీర్చే బడ్జెట్ ఇది అని మోడీ అభిప్రాయపడ్డారు.మౌళిక వసతుల కోసం రూ. 11 వేల కోట్లు కేటాయించినట్టుగా ఆయన గుర్తు చేశారు.యువతీ యువకుల కోసమేఈ బడ్జెట్ అని ఆయన  చెప్పారు.భారత్ కు ఈ బడ్జెట్ అంకితమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. ఈ బడ్జెట్ చారిత్రక బడ్జెట్ గా మోడీ పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు  ఈ బడ్జెట్ గ్యారెంటీ అని ఆయన  చెప్పారు.  దేశాభివృద్ది  కొనసాగుతుందని ఈ బడ్జెట్  ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని  మోడీ అభిప్రాయపడ్డారు. వరుసగా ఆరోసారి  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.  మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలా సీతారామన్  సమం చేశారు.

also read:Union Budget 2024:ఆదాయపన్ను స్లాబులు యథాతథం, నిర్మలా సీతారామన్ బడ్జెట్ పూర్తి వివరాలివీ...

పార్లమెంట్ కు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నందున  మధ్యంతర బడ్జెట్ నే ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.  అయితే ఆదాయ పన్ను స్లాబుల్లో  మార్పులు చేయలేదు. అయితే కొత్త పన్ను విధానం తెస్తామని కేంద్రం ప్రకటించింది. మరో వైపు  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద  రెండు కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్టుగా హామీ ఇచ్చింది.  ఇప్పటికే  మూడు కోట్ల ఇళ్లను నిర్మించిన విషయాన్ని కేంద్రం  గుర్తు చేసింది.