భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ లేఖ రాశారు. అందులో తమ దేశానికి మందులు, వైద్య పరికాలతో పాటు మానవతా సాయం చేయాలని కోరారు. భారత పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఈ లేఖను భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి అందించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు భారత్‌లో అధికారిక పర్యటనలో ఉన్న ఉక్రెయిన్ మొదటి ఉప విదేశాంగ మంత్రి ఎమిన్.. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి మంగళవారం అందజేశారని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ లేఖలో మందులు, వైద్య పరికరాలతో సహా అదనపు మానవతా సామాగ్రి కోసం ఉక్రెయిన్ అభ్యర్థించిందని ఎంఈఏ తెలిపింది.
జయ్ ప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను బయటకు తరలించిన అధికారులు..
ఎంఈఏ కార్యదర్శి (వెస్ట్) సంజయ్ వర్మతో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. తమ దేశంలో మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం భారతీయ కంపెనీలకు ఒక అవకాశంగా మారుతుందని అన్నారు. భారత్ తో బలమైన, సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవాలన్న ఉక్రెయిన్ ఆకాంక్షను ఈ సందర్భంగా ఝాపరోవా ప్రస్తావించారు.
కాగా.. ఝాపరోవా భారత పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి దోహదపడుతుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిగాయని తెలిపింది. ద్వైపాక్షిక ఎజెండాలో ఆర్థిక, రక్షణ, మానవతా సహాయం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు ఉన్నాయని ఎంఈఏ చెప్పింది.
బీహార్ లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రత నమోదు..
ఇరు దేశాల మధ్య తదుపరి విడత విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు రెండు దేశాలకు అనుకూలమైన తేదీలో కైవ్ లో జరుగుతాయని ఎంఈఏ తెలిపింది. ఉక్రెయిన్ ఉప విదేశాంగ మంత్రి తన మూడు రోజుల భారత పర్యటనను బుధవారంతో ముగియనుంది. కాగా.. గత ఏడాది ఫిబ్రవరి 24న తూర్పు యూరోపియన్ దేశంపై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ నుంచి భారత్ కు రావడం ఇదే తొలిసారి.
అయితే ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ నేత జెలెన్స్కీతో పలుమార్లు మాట్లాడారు. గత ఏడాది అక్టోబర్ 4న అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన ఫోన్ సంభాషణలో.. సైనిక చర్య పరిష్కారం కాదని, శాంతి ప్రయత్నాలకు సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ చెప్పారు. అయితే ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణను భారత్ ఇంకా ఖండించలేదు. దౌత్యం, చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని వాదిస్తోంది.
