పాట్నాలో ఉన్న జయ్ ప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందని దుండగుల నుంచి అధికారులకు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్ పోర్టులో నుంచి ప్రయాణికులను బయటకు తరలించారు. బాంబు కోసం పోలీసులు, బాంబ్ స్క్వాండ్ అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. 

పాట్నాలోని జయ్ ప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానశ్రాయంలో ఉన్న ప్రయాణికులందరినీ బయటకు తరలించారు. ఉదయం 10.47 గంటలకు అధికారులకు ఈ బాంబు హెచ్చరిక వచ్చింది. వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

కర్ణాటక ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది.. ఎందుకంటే ?

వీరంతా కలిసి బాంబు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే విమానాశ్రయంలో విమానాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తున్నాయి. కాగా.. గత ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం (6ఈ 2126) తన బ్యాగులో బాంబు ఉందని ఓ ప్రయాణికుడు చెప్పడంతో పాట్నా విమానాశ్రయంలో నిలిపివేశారు. అతడి బ్యాగును అధికారులు తనిఖీ చేశారు. కానీ అందులో బాంబు దొరకలేదు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విమానాన్ని తనిఖీ చేశారు.

Scroll to load tweet…

కొన్ని గంటలకు ముందు ఢిల్లీ పాఠశాలకు బాంబు బెదిరింపు
ఢిల్లీలోని ఓ పాఠశాలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో స్కూల్ మొత్తం ఖాళీ చేశారు. ఈ పరిణామం చోటు చేసుకున్న కొన్ని గంటల్లోనే పాట్నా విమానాశ్రయంలో బాంబు బెదిరింపు వార్తలు రావడం గమనార్హం. సాదిక్ నగర్ లోని ఇండియన్ స్కూల్ కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించారు. బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం రావడతో వారంతా వచ్చి అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు.