Asianet News TeluguAsianet News Telugu

టీఎస్ పీఎస్సీ లీక్ కేసు.. పరీక్ష రాసి, టెన్షన్ తో నిద్రలేని రాత్రులు.. దొరక్కూడదని దేవస్థానాలన్నీ తిరిగిన జంట

డీఏవో లీకైన పరీక్ష పేపర్ కొనుగోలు చేసిన ఓ జంట.. తాము దొరక్కూడదని భగవంతుడిని ప్రార్థిస్తూ పుణ్యక్షేత్రాలు తిరిగారు. తాము ఎక్కడ దొరికిపోతామేమో అనే భయంతో నిద్రలేని రాత్రులు గడిపారు. కానీ చివరికి అధికారుల దర్యాప్తులో దొరికిపోయారు. 

Paper leak case..Sleepless nights with tension even after writing the exam..Couple went to all the temples not to find them..ISR
Author
First Published Apr 12, 2023, 9:56 AM IST

ఆమె గ్రూప్ -1 పరీక్ష రాశారు. అయితే ఓఎంఆర్ షీట్ లో పొరపాటుగా డబుల్ బబ్లింగ్ చేశారు. దానిని సవరించుకునేందుకు టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి వెళ్తే.. అక్కడ డీఏవో పరీక్ష పేపర్ దొరికింది. దీంతో ఎంతో సంతోషంగా ఆ పరీక్షను రాశారు. ఇక జాబ్ గ్యారంటీ అనుకుంటున్న సమయంలో టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. ఎంతో మందిని అరెస్టు చేయడం ఆమెలో ఆందోళన కలిగించింది. ఇందులో దొరక్కుండా ఉండాలని భగవంతుడిని వేడుకుంటూ, టెన్షన్ తో నిద్రలేని రాత్రులు గడిపారు. అయినా కూడా చివరికి నేరం బయటకు వచ్చింది. ఇటీవల టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో  సిట్ అరెస్టు చేసిన ఖమ్మం కు చెందిన జంట సాయి సుస్మిత, సాయి లౌకిక్‌ల కథ ఇది. 

బీహార్ లో కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రత నమోదు..

‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన లౌకిక్ ఓ వ్యాపారి. ఆయన భార్య సుస్మిత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేసేవారు. అయితే గతేడాది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆమె ఉద్యోగాన్ని వదిలేసి పరీక్షకు సిద్ధమయ్యారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ కూడా రాశారు. అయితే ఓఎంఆర్‌ షీట్‌లో రాంగ్‌ బబ్లింగ్‌ చేయడంతో ఆమె ఫలితాన్ని టీఎస్ పీఎస్సీ ఆపేసింది. దీంతో దానిని సవరించుకోవడానికి ఆమె అనేక మార్లు టీఎస్‌పీఎస్సీ ఆఫీసుకు వెళ్లారు. ఇలా అనేక సార్లు వెళ్లి వస్తున్న సమయంలో ఆమెకు టీఎస్ పీఎస్సీ కమిషన్ సెక్రటరీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్‌ కుమార్‌తో పరిచయం అయ్యింది.

రైతుల కుమారులను పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు రూ.2 లక్షలిస్తాం - కర్ణాటక ఎన్నికల్లో కుమారస్వామి హామీ..

అయితే ప్రవీణ్ అప్పటికే కొన్ని పశ్నపత్రాలను అమ్మడం ప్రారంభించాడు. అతడికి సుస్మిత డీఏఓ పరీక్షకు కూడా ప్రిపేర్ అవుతున్నట్టు అర్థమయ్యింది. ఆమెతో డీల్ చేసుకున్నాడు. పేపర్ అమ్ముతానని చెప్పాడు. దీని కోసం సుస్మిత భర్త రూ.6 లక్షలను ఫిబ్రవరి 23న ప్రవీణ్ కు చెల్లించాడు. తరువాత అతడి నుంచి పేపర్ తీసుకొని భార్యకు ఇచ్చాడు. ఆ ప్రశ్రాపత్రాన్ని తీసుకొని రెండు రోజులు పరీక్షకు సుస్మిత సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీన అందరిలాగే పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశారు. 

జాతీయ గీతానికి అవమానం.. సిగరెట్ తాగుతూ, వెకిలిగా నవ్వుతూ గీతాలాపన.. వీడియో వైరల్.. నెటిజన్ల మండిపాటు

తనకు అంతకు ముందే తెలిసిన ప్రశ్నలే కావడంతో దాదాపు అన్ని ప్రశ్నలకు జావాబులను బబ్లింగ్ చేశారు.  గ్రూప్ -1 పేపర్ పరీక్ష రిజల్ట్ రాకపోయినా.. డీఏవో జాబ్ కచ్చితంగా వస్తుందని దంపతులు ఇద్దరూ అనుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ పేపర్ల లీకేజీ వ్యవహారం మార్చి 12వ తేదీన వెలుగులోకి రావడంతో వీరిద్దరూ ఆందోళనకు గురయ్యారు. ప్రవీణ్ కుమార్, మరి కొంత మంది నిందితులు అరెస్టు కావడంతో ఎంతో టెన్షన్ పడ్డారు. డీఏవో పేపర్ లీకైందనే వ్యవహారం బయటకు రాకూడదని కోరుకుంటూ, తాము ఈ లీకేజీ కేసులో దొరక్కూడదని పూజలు మొదలుపెట్టారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ చేతులు కలుపుతుంది - సోనియా గాంధీ

దీని కోసం ఎన్నో నిద్రలేని రాత్రులను ఈ జంట గడిపింది. ఈ ప్రెజర్ నుంచి బయటపడేందుకు తిరుమల శ్రీవారిని, షిర్డీ సాయి బాబాను దర్శించుకున్నారు. అలాగే మరికొన్ని దేవస్థానాలకు వెళ్లి భగవంతుడిని ప్రార్థించారు. అయితే పేపర్ కొనుగోలు చేసే సమయంలో లౌకిక్ రూ.6 లక్షలను నేరుగా ఇవ్వకుండా ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేసిన సిట్.. చివరికి ఈ దంపతులు ఇద్దరిని ఈ నెల 7వ తేదీన అదుపులోకి తీసుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios