Asianet News TeluguAsianet News Telugu

ఉద్ధవ్ ఠాక్రే నా సేనాపతి.. శివ‌సేనకు ఎప్పటికీ ద్రోహం చేయను- ఎంపీ సంజ‌య్ రౌత్.. త‌ల్లికి భావోద్వేగ లేఖ

శివసేనను తాను ఎప్పటికీ విడిచిపెట్టనని, మోసం చేయబోనని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఉద్దవ్ ఠాక్రే తన సేనాపతి, మంచి స్నేహితుడు అని అన్నారు. ఈ మేరకు ఆయన తన తల్లికి భావోద్వేగ లేఖ రాశారు. 

Uddhav Thackeray is my Senapati.. I will never betray Shiv Sena- MP Sanjay Raut.. Emotional letter to mother
Author
First Published Oct 13, 2022, 10:34 AM IST

తన పార్టీ శివ‌సేనను, ఉద్ద‌వ్ ఠాక్రేను తాను ఎప్ప‌టికీ మోసం చేయ‌బోన‌ని ఆ పార్టీ రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్ అన్నారు. ఉద్ద‌వ్ ఠాక్రేను ఆయ‌న త‌న సేనాప‌తి (క‌మాండ‌ర్(గా అభివ‌ర్ణించారు. త్వ‌ర‌లోనే త‌న ఇంటికి, కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు తిరిగి వ‌స్తాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. ప్ర‌స్తుతం జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న ఆయ‌న త‌న త‌ల్లికి రాసిన భావోద్వేగ లేఖ‌లో ఈ విష‌యాల‌ను పంచుకున్నారు. 

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగ‌స్టు 1వ తేదీన సంజ‌య్ రౌత్ ను అరెస్టు చేసింది. త‌రువాత కోర్టు ఆయ‌న‌కు జ్యుడీష‌య‌ల్ క‌స్ట‌డీ విధించింది. అయితే ఆగ‌స్టు 8వ తేదీన ఆయ‌న కోర్టు వెలుప‌ల బెంచీపై కూర్చొని త‌న త‌ల్లికి లేఖ రాశారు. ఈ లేఖ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

క‌ర్ణాట‌క హిజాబ్ నిషేధంపై "సుప్రీం" సంచ‌ల‌న‌ తీర్పు నేడే .. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌..

జూలై 31వ తేదీన ఈడీ త‌న ఇంట్లో దాడి చేసిన‌ప్పుడు ఆయ‌న శివసేన వ్యవస్థాపకుడు, దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రే ఫొటో వ‌ద్ద ఎలా కూర్చున్నాడో, త‌ల్లి ఎలా కూర్చుందో వంటి వివ‌రాల‌ను త‌ల్లి సవితా ఆర్ రౌత్ తో ఈ లేఖ‌లో పంచుకున్నారు. ఆరోజు సాయంత్రం పోలీసులు ఆయ‌న‌ను తీసుకెళ్లిన‌ప్పుడు నిగ్ర‌హం కోల‌పోవ‌డం, విసిగిపోవ‌డం వంటి విష‌యాల‌ను కూడా ప్ర‌స్తావించారు. 

“నువ్వు నన్ను సున్నితంగా మందలించావు... ఏడవడం మొదలుపెట్టావు... బయట నినాదాలు చేస్తున్న వందలాది మంది శివసైనికుల గర్జన, నీ కేకలు మ‌ధ్య బ‌య‌ట‌కు వ‌చ్చాను. వాళ్లకు చేయి ఊపాను. త్వ‌ర‌గా తిరిగిర‌మ్మ‌ని చెబుతూ ఆ నా చేయి ప‌ట్టుకొని ఉన్నావు. త‌రువాత (ఈడీ) కారు బయటకు వెళ్లింది’’ అని రౌత్ లేఖలో పేర్కొన్నారు.

ఆడ శిశువును చంపి.. త‌ల్లిదండ్రుల‌కు సానుభూతి కార్డు పంపిన న‌ర్సు.. మ‌రో ప‌ది మందిని చంపేదుకూ ప్ర‌య‌త్నం..

తిరిగి వస్తానని త‌ల్లికి వాగ్దానం చేస్తూ.. వేలాది మంది జవాన్లు ఇంటికి వ‌చ్చే ముందు నెలల తరబడి సరిహద్దుల్లో కాపలాగా ఉంటారని, కొందరు తిరిగి రాలేరని ఆ లేఖ‌లో చెప్పారు. కానీ యుద్ధాలు ఉన్నాయ‌ని, తాను అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాన‌ని చెప్పారు. తాను శివసేన శత్రువుల ముందు ఎప్పటికీ తలవంచన‌ని తెలిపారు. 

పార్టీని కాపాడేందుకు పోరాటం అవసరమని సంజ‌య్ రౌత్ పేర్కొన్నారు. అమ్మను వ‌ద‌ల‌న‌ట్టే శివ‌సేనను, బాలాసాహెబ్ ఠాక్రేను ఎన్న‌డూ వ‌ల‌ద‌న‌ని అన్నారు. ‘‘ ఉద్ధవ్ ఠాక్రే నాకు అత్యంత ప్రియమైన స్నేహితుడు, నా 'సేనాపతి' (కమాండర్). పార్టీ పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. ఇలాంటి క్లిష్ట తరుణంలో నేను ఆయనకు ద్రోహం చేస్తే బాలాసాహెబ్‌కు నేను ఏ ముఖం చూపిస్తాను? ’’ అంటూ ఆయన  లేఖ‌లో తెలిపారు.

టీచర్ తో విద్యార్థి ప్రేమాయణం.. ఆమెకు పెళ్లి కుదరడంతో మనస్తాపంతో ఆత్మహత్య..

నైతిక స్థైర్యాన్ని కోల్పోవడానికి లేదా లొంగిపోవడానికి ఇది సమయం కాదని చెప్పారు. ఈడీ, ఐటీ మొదలైన వాటికి భయపడి తాను ఎప్పుడూ మోకాళ్లపై పడనని రౌత్ అన్నారు. ఇవే చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను కదిలించింద‌ని తెలిపారు. అందుకే వారు పార్టీని వీడార‌ని ఆరోపించారు. ‘‘ మోసగాళ్ల జాబితాలో నా పేరు అక్కర్లేదు. ఈ స‌మ‌యంలోనే దృఢంగా ఉండాలి. బాలాసాహెబ్, మీరు (త‌ల్లి) నాకు ఇచ్చిన ధైర్యం నాకు ఉంది ’’ అని సంజయ్ రౌత్ తన లేఖలో పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios