Asianet News TeluguAsianet News Telugu

టీచర్ తో విద్యార్థి ప్రేమాయణం.. ఆమెకు పెళ్లి కుదరడంతో మనస్తాపంతో ఆత్మహత్య..

తన దగ్గర ట్యూషన్ కు వచ్చిన మైనర్ బాలుడిని ప్రేమిస్తున్నానని చెప్పిందో ఉపాధ్యాయురాలు. ఇంట్లో ఆమెకు పెళ్లి నిశ్చయించడంతో మాట్లాడడం మానేసింది.. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

teacher arrested in pocso act over minor student suicide case in tamilnadu
Author
First Published Oct 13, 2022, 6:48 AM IST

చెన్నై : విద్యార్థి మృతి కేసులో ఉపాధ్యాయురాలిని పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చెన్నై అంబత్తూరు కు చెందిన ప్లస్ టూ ముగించిన విద్యార్థి (17) ఆగస్టు 30వ తేదీన స్నేహితులతో కలిసి చెన్నై రాజధాని కళాశాలలో కౌన్సెలింగ్ కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు.  ఆ తర్వాత గదిలో ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు.  తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అంబత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

అంబత్తూర్ లోని సర్ రామస్వామి మొదలియార్ హైయర్ సెకండరీ పాఠశాలలో అతను చదువుతున్నప్పుడు తాత్కాలిక ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహిళ నడుపుతున్న ట్యూషన్ కు బాలుడు వెళ్లినట్లు తెలిసింది. ఆ సమయంలో అతడిని ప్రేమించినట్టు ఆమె చెప్పిందని సమాచారం. ఆ తరువాత ఆమెకు ఇంట్లో  వివాహం నిశ్చయించడంతో విద్యార్థితో మాట్లాడటం మానేసింది. తర్వాత తనను పట్టించుకోలేదని మనస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీంతో  ఉపాధ్యాయురాలిని మంగళవారం పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. 

జార్ఖండ్‌లోని దుమ్కాలో చెట్టుకు వేలాడుతూ మరో గిరిజన బాలిక మృతదేహం

ఇదిలా ఉండగా, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థితో ఓ లెక్చరర్ పరారై వివాహం చేసుకున్న ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో ఈ యేడు మార్చిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… తమిళనాడులోని తురైయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి మార్చి నెల 5 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కంగారుపడిన యువకుడి తల్లిదండ్రులు కుమారుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా... ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు పోలీసులనూ ముక్కుమీద వేలేసుకునేలా చేశాయి. 

విద్యార్థిలాగే అదే కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ 26 ఏళ్ల షర్మిల కూడా అదృశ్యం కావడాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. షర్మిల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకున్నారు. షర్మిల ఆ బాలుడిని ప్రేమించి, తీసుకెళ్లి, పెళ్లి చేసుకుందని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్లి షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇకా, ఇలాంటి ఘటనే నిరుడు జూన్ లో పంజాబ్ లో కలకలం రేపింది. పంజాబ్, హర్యానాలో ఓ ట్యూషన్ టీచర్ టీనేజ్ విద్యార్థితో పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే.. పానిపట్ కు చెందిన ఓ కుటుంబం, తమ 17యేళ్ల కొడుకుకు ట్యూషన్ చెప్పడానికి 20యేళ్ల వయసున్న మహిళా టీచర్ ను నియమించారు. అలా మూడు నెలలుగా ఆమె ప్రతిరోజూ ఇంటికి వెళ్లి అతడికి ట్యూషన్ చెబుతుండేది. రోజూ నాలుగు గంటలపాటు ట్యూషన్ సాగుతుంది. ఈ క్రమంలో 2021, మే 29న ఆ అబ్బాయి ఇంటికి దగ్గర్లో ఉన్న దేస్రాజ్ కాలనీలో ఉండే ట్యూషన్ టీచర్ ఇంటికి వెడుతున్నానని చెప్పి వెళ్లాడు. 

రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. కంగారుగా ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లారు. అక్కడ వాకబు చేస్తే.. టీచర్ తల్లిదండ్రులు తమ కూతురు కూడా కనిపించడంలేదంటూ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఆ టీచర్ మీద మైనర్ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios