Asianet News TeluguAsianet News Telugu

ఆడ శిశువును చంపి.. త‌ల్లిదండ్రుల‌కు సానుభూతి కార్డు పంపిన న‌ర్సు.. మ‌రో ప‌ది మందిని చంపేదుకూ ప్ర‌య‌త్నం..

ముద్దులొలికే చిన్నారులను చంపడమే పనిగా ఓ పెట్టుకుంది ఓ నర్సు. యూకేలోని ఓ హాస్పిటల్ లో నియో-నేటల్ యూనిట్‌లో సేవలందించే ఓ నర్సు తాజాగా ఓ పసి పాపను చంపేసింది. పైగా ఆ చిన్నారి తల్లిదండ్రులకు సానుభూతి కార్డు కూడా పంపించింది. 

The nurse who killed the baby girl and sent a sympathy card to her parents also tried to kill ten more people.
Author
First Published Oct 13, 2022, 9:27 AM IST

ఓ న‌ర్సు త‌న పైశాచిక‌త్వం ప్ర‌ద‌ర్శించింది. హ‌స్పిట‌ల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న శిశువును చంపేసి, త‌ల్లిదండ్రుల‌కు సానుభూతి సందేశం పంపించి ఆనందించింది. ఈ ఘ‌ట‌న యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)లోని ఓ హాస్పిట‌ల్ లో చోటు చేసుకుంది. చికిత్స కోసం నియో-నేటల్ యూనిట్‌లో ఉంచిన ఆడ శిశువును అందులో పని చేసే ఓ మ‌హిళా న‌ర్స్ ఐదో ప్ర‌య‌త్నంలో చంపేసింది. 

టీచర్ తో విద్యార్థి ప్రేమాయణం.. ఆమెకు పెళ్లి కుదరడంతో మనస్తాపంతో ఆత్మహత్య..

ఆ న‌ర్సు మరో 10 మంది శిశువులను కూడా చంపేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. నిందితురాలిని లూసీ లెట్బీగా పోలీసులు గుర్తించారు. వాయువ్య యూకేలోని చెస్టర్ హాస్పిటల్‌లో మొత్తం ఏడుగురు శిశువులను హత్య చేసినట్లు కూడా ఆమె ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

ఏఎఫ్‌పీ నివేదిక ప్ర‌కారం.. ఈ హత్యలు 2015 జూన్ - 2016 జూన్ మధ్యలో జరిగాయి. ఈ విష‌యాల‌న్నీ మాంచెస్టర్ క్రౌన్ లో ఇటీవ‌ల కోర్టులో జ‌రిగిన విచార‌ణ సంద‌ర్భంగా వెలుగులోకి వ‌చ్చాయి. ఈ కేసులో ప్రాసిక్యూటర్‌గా ఉన్న నిక్ జాన్సన్.. ఆ న‌ర్సు నాలుగుసార్లు ఆ ఆడ పిల్లను చంపేందుకు ప్ర‌య‌త్నించింద‌ని చెప్పారు. ఈ మొత్తం కేసు ప్రమాణాల ప్రకారం కూడా బాలిక మరణం అత్యంత దారుణమని ఆయన అన్నారు.

జార్ఖండ్‌లోని దుమ్కాలో చెట్టుకు వేలాడుతూ మరో గిరిజన బాలిక మృతదేహం

32 ఏళ్ల నిందితురాలు న‌ర్సు ప‌సి పాప‌ను  చంపేందుకు ప్ర‌య‌త్నించినా శిశువు ధృడంగానే ఉందని, అయితే చివ‌రికి గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి ఆమె విజ‌యం సాధించింద‌ని నిక్ జాన్సన్ కోర్టుకు తెలిపారు. ముందుగా ఆ న‌ర్సు నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా శిశువు కడుపులోకి ఉద్దేశపూర్వకంగా గాలిని పంపించి దారుణంగా హ‌త్య చేసింద‌ని పేర్కొన్నారు. 

కాగా.. 2015 సెప్టెంబరు 30వ తేదీన మొదటి సారిగా ఓ బాలిక‌ను చంపేందుకు లెట్బీ ప్ర‌య‌త్నించింది. అదే ఏడాది అక్టోబర్ 13వ తేదీన నైట్ షిఫ్ట్ సమయంలో ఓ శిశువును చంపేసి చీక‌టి గదిలో ప‌సిపాప చ‌నిపోయింద‌ని త‌న సహోద్యోగితో చెప్పింది.

అమిత్ షాకు దేశ చరిత్రపై అవగాహన లేదంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫైర్

అయితే తాజాగా ఘ‌ట‌న‌లో.. బాధిత కుటుంబానికి నిందితురాలు సానుభూతి కార్డు కూడా పంపించింది. ఈ విష‌యం ఆమె పోలీసుల ఎదుట చెప్పిన‌ట్టు స‌మాచారం. కాగా.. ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల‌కు ఆమె ఇది వ‌ర‌కే ప‌రిచ‌యం ఉంద‌ని, ఆ స‌న్నిహితం వ‌ల్లే ఇలా సానుభూతి వ్య‌క్తం చేశాన‌ని పేర్కొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios