మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతం.. ఒక్కొక్కరిపై రూ.14 లక్షల రివార్డు

మధ్యప్రదేశ్ లో పోలీసుల చేతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. ఇందుల్లో ఒక్కొక్కరికి రూ.14 లక్షల చొప్పున రివార్డు ఉంది. బాలాఘాట్ జిల్లాలోని అడవుల్లో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో వీరు చనిపోయారు. 

Two women Maoists killed in Madhya Pradesh's Balaghat.. Rs 14 lakh reward for each..ISR

మావోయిస్టు ప్రభావిత బాలాఘాట్ జిల్లాలోని అడవుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులను మధ్యప్రదేశ్ పోలీసుల స్పెషల్ యాంటీ మావోయిస్ట్ హాక్ ఫోర్స్ శనివారం తెల్లవారుజామున కాల్చి చంపింది. వీరిని సునీత, సరితలుగా గుర్తించారు. మొత్తంగా రూ.28 లక్షల రివార్డు ఉన్న వీరిద్దరి కోసం పలు రాష్ట్రాల్లో పోలీసులు గాలిస్తున్నారు. చివరికి శనివారం వీరిద్దరు పోలీసులకు చిక్కి హతమయ్యారు. కాగా.. తాజా ఘటనతో మధ్యప్రదేశ్ లోని మావోయిస్టు ప్రభావిత బాలాఘాట్, మాండ్లా జిల్లాల్లో రెండేళ్లలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

తమ సీక్రెట్లు బయటపెడుతాడని అతిక్ అహ్మద్ ను ప్రతిపక్షాలే చంపాయి - యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన పలు వివరాలను పోలీసులు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వెల్లడించారు. మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో వారిని అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్ పోలీసుల హాక్ ఫోర్స్ బృందం బయలుదేరిందని పేర్కొన్నారు. బాలాఘాట్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో, మహారాష్ట్ర సరిహద్దుకు కిలోమీటరు దూరంలోని గాడీ ప్రాంతంలోని అడవిలో ఈ ఎన్ కౌంటర్ జరిగిందని చెప్పారు. 

రాజస్థాన్ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. ఎన్ఐసీయూలోని 12 మంది చిన్నారులను రక్షించిన రెస్క్యూ టీం

అయితే భోరందేవ్ ఏసీఎం సునీత, ఖతియామోచా ఏసీఎం సరితను హాక్ ఫోర్స్ కాల్చి చంపినట్లు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం ధృవీకరించింది. సునీత ప్రస్తుతం విస్తార్ దళంలో ఉండగా, సరిత వాంటెడ్ మావోయిస్టు కబీర్ కు గార్డుగా పనిచేసి ఇటీవల విస్తార్ దళానికి బదిలీ అయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు 303 రైఫిల్స్, లైవ్ కాట్రిడ్జ్ లు, రేషన్ లభించాయి. 

బాలాఘాట్ లో ఓ మహిళ సహా ముగ్గురు మావోయిస్టులను కాల్చి చంపిన తర్వాత ఇది రెండో భారీ ఆపరేషన్. లాంజీ ప్రధాన కార్యాలయానికి 15 కిలోమీటర్ల దూరంలోని బహేలా పోలీస్ పరిధిలోని కడ్లా గ్రామంలో 2022 జూన్ లో ఆ ఎన్కౌంటర్ జరిగింది. మృతులు తండా, దరేకాస దళం సభ్యులు నగేష్, మనోజ్, రాముగా గుర్తించారు. నగేష్ డివిజనల్ కమిటీ మెంబర్ గా, మనోజ్ ఏరియా కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదే కదా తల్లి ప్రేమంటే.. లేగను వేటాడేందుకు వచ్చిన పులినే వెంటాడిన ఆవు.. వీడియో వైరల్..

కాగా.. 2022 నవంబర్ లో బాలాఘాట్ జిల్లాలోని కన్హా నేషనల్ పార్క్ సమీపంలో మావోయిస్టులు ఒక అటవీ కార్మికుడిని చంపారు దీంతో అదే ఏడాది నవంబర్ 30వ తేదీన ఛత్తీస్ ఘడ్ ను ఆనుకొని ఉన్న కన్హా ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టు నాయకులను పోలీసులు హతమార్చారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, ఇతర తుపాకులను స్వాధీన పర్చుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios