తమ సీక్రెట్లు బయటపెడుతాడని అతిక్ అహ్మద్ ను ప్రతిపక్షాలే చంపాయి - యూపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
తమ సీక్రెట్లు బయపెడుతాడనే భయంతో అతిక్ అహ్మద్ ను ప్రతిపక్షాలే హతమార్చాయని ఉత్తరప్రదేశ్ మంత్రి ధర్మపాల్ సింగ్ ఆరోపించారు. అతడి హత్యలో ప్రతిపక్షాల పాత్ర ఉందనేది వాస్తవమని చెప్పారు.
గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్యలో ప్రతిపక్షాల ప్రమేయం ఉందని ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ నాయకుడు ధర్మపాల్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అరెస్టు తర్వాత అహ్మద్ అనేక రహస్యాలను బయటపెట్టబోతున్నాడని, అదే అతడి హత్యకు దారితీసిందని సింగ్ ఆరోపించారు.
హమ్మయ్య.. ఎట్టకేలకు పంజాబ్ పోలీసులకు చిక్కిన అమృత్ పాల్ సింగ్.. అస్సాంలోని దిబ్రూగఢ్ కు తరలింపు..
‘‘అతిక్ ను చంపడంలో ప్రతిపక్షాల ప్రమేయం ఉందనేది వాస్తవం. కొన్ని తీవ్రమైన రహస్యాలు బహిర్గతం కాబోతున్నాయి. అందుకే ప్రతిపక్షాలు అతన్ని హత్య చేశాయి’’ అని ఆయన అన్నారు. చందౌసి మున్సిపల్ ఎన్నికల కోసం నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సదస్సుల్లో ధర్మపాల్ సింగ్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 15వ తేదీన ప్రయాగ్ రాజ్ లో అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ను జర్నలిస్టుల వేషంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు హత్య చేశారు. నగరంలోని కొల్విన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం పోలీసులు తీసుకెళ్తుండగా అన్నదమ్ములిద్దరిపై దుండగులు కాల్పులు జరిపారు. అతిక్ ను, అతని సోదరుడిని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపిన ఆ ముగ్గురు నిందతులు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అంతకు ఒక రోజు ముందే ఝాన్సీ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ నుయూపీ ఎస్టీఎఫ్ హతమార్చింది. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య, ఈ ఏడాది ఫిబ్రవరిలో బీఎస్పీ నేత హత్య కేసులో కీలక సాక్షి ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నాడు.
రాజస్థాన్ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. ఎన్ఐసీయూలోని 12 మంది చిన్నారులను రక్షించిన రెస్క్యూ టీం
దిలా ఉండగా.. అతిక్ అహ్మద్ హత్యపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిటీ సభ్యులు గురువారం ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక దర్యాప్తు బృందం.. అతిక్, అతడి సోదరుడిని కాల్చి చంపిన సీన్ రీ క్రియేట్ చేసింది. తదుపరి దర్యాప్తు కోసం హత్యకు ముందు అతిక్ హంతకులు బస చేసిన హోటల్ కు చేరుకుంది. ఈ కేసుపై తదుపరి విచారణ జరిపేందుకు సిట్ బృందం హమీర్ పూర్, కాస్ గంజ్ లలో కూడా పర్యటించింది.