రాజస్థాన్ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. ఎన్ఐసీయూలోని 12 మంది చిన్నారులను రక్షించిన రెస్క్యూ టీం
రాజస్థాన్ రాష్ట్రం దుర్గాపూర్ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలో అగ్రిప్రమాదం జరిగింది. ఆ హాస్పిటల్ లో ఉన్న ఎన్ఐసీయూలో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. చిన్నారులను రక్షించారు.
రాజస్థాన్ లోని దుర్గాపూర్ మెడికల్ కాలేజీలో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దుంగార్ పూర్ లో ఉన్న ఈ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ) వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి 12 మంది చిన్నారులను రక్షించినట్లు అధికారులు తెలిపారు.
ఇదే కదా తల్లి ప్రేమంటే.. లేగను వేటాడేందుకు వచ్చిన పులినే వెంటాడిన ఆవు.. వీడియో వైరల్..
ఈ ఘటనపై సమాచారం అందగానే మూడు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. వాటి ద్వారా మంటలను ఆర్పి 12 మంది పిల్లలను రక్షించినట్లు మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ మహేంద్ర దామోర్ మీడియాతో తెలిపారు.
త్రివర్ణ పతాకానికి ఘోర అవమానం.. జాతీయ జెండాతో చికెన్ శుభ్రం.. వీడియో వైరల్, నెటిజన్ల ఫైర్..
నవజాత శిశువులు ఉన్న వార్డులో మంటలు చెలరేగాయని, తమ సిబ్బంది పిల్లలను కాపాడారని ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ బాబులాల్ చౌదరి పేర్కొన్నారు. నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదంపై సమాచారం తెలియగానే వెంటనే తన టీమ్ తో కలిసి మూడు వాహనాల్లో వచ్చామని ఆయన తెలిపారు. మంటలను చల్లార్చి, శిశువులను బయటకు తీసుకొచ్చామని వివరించారు.
కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.