Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం.. ఏనుగుల దాడిలో ఇద్దరు వృద్దుల మృతి..

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఇద్దరు వృద్దులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ప్రమాదాల్లో ఆ ఇద్దరు వృద్దులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. 

Two old men killed in an elephant attack in Chhattisgarh.
Author
First Published Sep 18, 2022, 3:58 PM IST

ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం జ‌రిగింది. సూరజ్‌పూర్ జిల్లాలో ఏనుగుల గుంపు దాడి చేయ‌డంతో ఇద్ద‌రు వృద్ధులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక అట‌వీ శాఖ అధికారులు ధృవీక‌రించారు. ప్రేమ్‌నగర్ అటవీ పరిధిలో గత వారం రోజుల నుంచి 12 ఏనుగుల గుంపు సంచరిస్తోందని వారు తెలిపారు.

రాజ‌స్థాన్ లో దారుణం.. హోం వ‌ర్క్ చేయ‌లేద‌ని స్టూడెంట్ ను చిత‌క‌బాదిన టీచ‌ర్.. హాస్పిట‌ల్ లో చేరిన బాలుడు

మృతుల్లో జనార్దన్‌పూర్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు రైమతి, అభయ్‌పూర్‌కు చెందిన మన్‌బోద్ గోండ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు ఉన్నారు. మన్‌బోద్ గోండ్ మ‌రో వ్య‌క్తితో క‌లిసి అభయ్‌పూర్ గ్రామ సమీపంలో ఉన్న అడ‌విలోని ఆయల‌యంలో పూజ‌లు చేసి రాత్రి 12.30 గంట‌ల‌కు భోజ‌నం చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఏనుగుల మంద అక్క‌డికి చేరుకుంది. దీంతో ఓ గ్రామ‌స్తుడు అక్క‌డి నుంచి ఎలాగోలా త‌ప్పించుకున్నాడు. కానీ మ‌న్ బోధ్ ను ఏనుగులు వెంబ‌డించి తొక్కి చంపేశాయ‌ని అటవీ డివిజన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సంజయ్ యాదవ్ తెలిపారు.

లిఫ్ట్‌ ప్రమాదం.. మధ్యలో ఇరుక్కుని ప్రాణాలు వదిలిన టీచర్.. డోర్లు ఓపెన్ ఉండగానే కదిలిన లిఫ్ట్

అలాగే జనార్దన్‌పూర్ గ్రామంలోని తన గుడిసెలో వృద్దురాలు రైమతి నిద్రిస్తోంది. ఆ గుడిసె వ‌ద్ద‌కు ఏనుగులు చేరుకొని వృద్ధురాలిపై దాడి చేశాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనాస్థలికి చేరుకున్న అటవీశాఖ అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. అయితే అటవీ సిబ్బంది ఎనుగుల మంద‌ను ట్రాక్ చేస్తోందని, స‌మీపంలోని గ్రామాల‌ను అప్రమత్తం చేస్తున్నామ‌ని అధికారులు తెలిపారు.

థ్రిల్లర్ సినిమాను తలపించే దర్యాప్తు.. 25 ఏళ్ల కింది మర్డర్ కేసు.. ఒక్క క్లూ లేకున్నా ఛేదించిన పోలీసులు

బాధితురాలి కుటుంబ సభ్యులకు తక్షణ సాయంగా రూ.25 వేలు అందజేశామని, లాంఛనాలు పూర్తయిన తర్వాత మిగిలిన ఒక్కొక్కరికి రూ.5.75 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అధికారులు చెప్పారు. కాగా..ఛత్తీస్‌గఢ్ లోని ఉత్తరాది ప్రాంతంలో మ‌నుషుల‌పై ఏనుగుల దాడి గత దశాబ్ద కాలంగా ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నేళ్లుగా మధ్య ప్రాంతంలోని జిల్లాలకు ఈ ముప్పు పొంచి ఉంది.

కొలీజియం నియామకాల వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది - కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు

ముప్పును ఎదుర్కొంటున్న జిల్లాల్లో సర్గుజా, రాయ్‌ఘర్, కోర్బా, సూరజ్‌పూర్, మహాసముంద్, ధామ్‌తరి, గరియాబంద్, బలోద్, బల్రాంపూర్ మరియు కాంకేర్ ఉన్నాయి. అటవీ శాఖ లెక్కల ప్రకారం గత మూడేళ్లలో రాష్ట్రంలో ఏనుగుల దాడిలో 210 మందికి పైగా చ‌నిపోయారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios