Asianet News TeluguAsianet News Telugu

రాజ‌స్థాన్ లో దారుణం.. హోం వ‌ర్క్ చేయ‌లేద‌ని స్టూడెంట్ ను చిత‌క‌బాదిన టీచ‌ర్.. హాస్పిట‌ల్ లో చేరిన బాలుడు

రాజస్థాన్ లోని జోద్ పూర్ జిల్లాలో దారుణం జరిగింది. హోం వర్క్ చేయలేదనే కోపంతో ఓ స్టూడెంట్ పై టీచర్ విచక్షణా రహితంగా దాడి చేసాడు. దీంతో ఆ బాలుడు హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నాడు. 

Atrocious in Rajasthan.. The teacher crushed the student for not doing homework.. The boy was admitted to the hospital.
Author
First Published Sep 18, 2022, 3:19 PM IST

రాజస్థాన్‌లో పాఠశాలల్లో చిన్నారులపై నిత్యం దాడులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఇలాంటి ఉదంతాలు చాలా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.  తాజాగా జోధ్ పూర్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఓ ఉపాధ్యాయుడు చిత‌క‌బాదాడు. దీంతో తీవ్రగాయాల పాలైన బాలుడు హాస్పిట‌ల్ లో చేరాడు. అయితే హోంవర్క్ పూర్తి చేయనందుకే ఆ ఉపాధ్యాయుడు ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. 

లిఫ్ట్‌ ప్రమాదం.. మధ్యలో ఇరుక్కుని ప్రాణాలు వదిలిన టీచర్.. డోర్లు ఓపెన్ ఉండగానే కదిలిన లిఫ్ట్

వివ‌రాలు ఇలా ఉన్నాయి. జోద్ పూర్ లోని బోరుండా ఉన్న డాక్టర్ రాధాకృష్ణన్ సీనియర్ సెకండరీ స్కూల్ లో ఆకాశ్ అనే విద్యార్థి తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయితే ఇటీవ‌ల ఎప్ప‌టిలాగే స్కూల్ కు వెళ్లిన ఆ బాలుడిని టీచ‌ర్ రామ్ కరణ్ తీవ్రంగా కొట్టాడు. దాదాపు 15 సార్లు చెంప‌ల‌పై కొట్టాడ‌ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’  తన కథనంలో తెలిపింది. దీంతో బాలుడి శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ఆ విద్యార్థికి జ్వరం, తల, చెవిలో నొప్పి రావ‌డంతో ఓ బంధువు ఇంటికి తీసుకొచ్చాడు. కుటుంబ సభ్యులు త‌మ కుమారుడిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. దీంతో అక్క‌డి వైద్యులు బాలుడిని మెరుగైన చికిత్స కోసం జోధ్ పూర్ లోని మ‌రో హాస్పిట‌ల్ కు రిఫ‌ర్ చేశారు.

థ్రిల్లర్ సినిమాను తలపించే దర్యాప్తు.. 25 ఏళ్ల కింది మర్డర్ కేసు.. ఒక్క క్లూ లేకున్నా ఛేదించిన పోలీసులు

ఏం జ‌రిగింద‌ని త‌ల్లిదండ్రులు ఆకాశ్ ను ఆరాతీయ‌గా ఉపాధ్యాయుడు చేసిన ప‌నిని వివ‌రించాడు. దీంతో  విద్యార్థి తండ్రి కనారామ్ టీచర్ రామ్ కరణ్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. బోరుండా పోలీస్ స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ హుకుమ్ గిరి ఫిర్యాదు స్వీక‌రించి, నిందితుడిపై కేసు న‌మోదు చేసుకున్నారు. అనంత‌రం పోలీసులు హాస్పిట‌ల్ కు చేరుకొని ఆకాశ్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అయితే బాధితుడు హాస్పిట‌ల్ లో ఉన్న‌ప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ కుమారుడు తన వద్దకు వచ్చాడని,ఉపాధ్యాయుడిపై కేసును ఉపసంహరించుకోవాలని ఆయ‌న కోరాడ‌ని బాలుడి తండ్రి మీడియాకు తెలిపారు. 

కొలీజియం నియామకాల వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది - కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు

ఇదిలా ఉండ‌గా.. తాను ఆకాశ్ ను కొట్ల‌లేద‌ని నిందితుడైన రామ్ కరణ్ చెప్పారు. విద్యార్థి హోం వ‌ర్క్ చేయ‌క‌పోవ‌డంతో చేతులు పైకెత్తి క్లాసులో నిల‌బ‌డాల‌ని మాత్ర‌మే ఆదేశించిన‌ట్టు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios