రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో నలుగురు దుండగులు తుపాకీతో బెదిరించి.. ఓ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. అప్రమత్తమైన గ్రామస్థులు ఇద్దరు నిందితులను పట్టుకుని విద్యార్థిని విడిపించారు. కిడ్నాపర్లను చెట్టుకు కట్టేసి కొట్టి పోలీసులకు అప్పగించారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఫేక్ పోలీసులలా నటిస్తూ ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, అప్రమత్తమైన గ్రామస్థులు ఆ నిందితులను పట్టుకుని.. చెట్టుకు కట్టేసి.. చితకబదారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌పూర్ ప్రాంతంలోని భడ్కా గ్రామానికి చెందిన తస్లీమ్ తన ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు పాఠశాలను మూసివేశారు. ఈ క్రమంలో తస్లీం తన మేనమామ కొడుకు అస్జాద్ తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి సైకిల్ మీద వస్తున్నాడు. అంతలో వారి సైకిల్ ను ఓ బైక్ వచ్చి ఢీ కొట్టింది. దీంతో తస్లీమ్, అస్జాద్ ఇద్దరు కిందపడ్డారు.
ఆ వెంటనే పోలీసు డ్రెస్ లో వచ్చిన నకిలీ పోలీసులు.. తస్లీమ్‌ను మరో బైక్‌పై ఎక్కించుకుని.. హర్యానా వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో సోహైల్, అతని స్నేహితులు దుండగులతో గొడవపడ్డారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ, వారిని ఆపలేకపోయారు. అయితే.. అస్జాద్ వెంటనే తస్లీమ్ ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారని గుర్తించి..కుటుంబ సభ్యులకు తెలిపారు.
తన కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడని తెలుసుకున్న తల్లిదండ్రులకు వెంటనే..తమ పక్కన ఉన్న గ్రామంలోని బంధువులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఘటనా స్థలానికి సుమారు 7 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత బంధువులు ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. మొదట చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న భాడ్కా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు విచారించగా.. చిన్నారిని కిడ్నాప్ చేసే క్రమంలో పిస్టల్ గురిపెట్టి చంపేద్దామని బెదిరించినట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. రెండు నెలలుగా కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
వారు చిన్నారిని హర్యానాకు తీసుకెళ్లి అక్కడికి వెళ్లి.. అతడి కుటుంబ సభ్యులను బెదిరించి.. వారి నుంచి డబ్బు డిమాండ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, వారికి తగిన సమయం లభించలేదు. అదే సమయంలో మార్గమధ్యంలో ఇద్దరూ తన తలపై పిస్టల్ గురిపెట్టి, చంపడానికి ప్లాన్ చేశారని బాధిత పిల్లవాడు చెప్పాడు.
గ్రామస్థులు ఇద్దరినీ పట్టుకునేలోపే చిన్నారిని ఎక్కడ చంపాలని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారని తెలిపాడు. ఈ ఘటనలో ప్రమేయమున్న ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
