ఉత్తరప్రదేశ్ లో ని బలరాంపూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు పాము కాటుతో రెండు రోజుల వ్యవధిలో చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పాములు ప‌గ‌ప‌డుతాయా ? ఈ ప్ర‌శ్న‌కు భిన్న‌ర‌కాల స‌మాధానాలు వ‌స్తాయి. వాటి జీవిత‌కాలమే కొన్ని నెల‌లు అవి ఎలా గుర్తుంచుకొని మ‌రీ ప‌గ‌ప‌డుతాయ‌ని కొంద‌రు అంటే ? మ‌రి కొంద‌రు లేదు నిజంగానే పాములు ప‌గప‌డుతాయ‌ని అంటారు. ఏదీ ఏమైనా కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తుంటే పాము ప‌గ వాస్త‌వ‌మే అని అనిపిస్తుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో జ‌రిగిన తాజా ఘ‌ట‌న ఈ వాదానికి బ‌లాన్ని చేకూరుస్తోంది. రెండు రోజుల వ్య‌వ‌ధిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు పాము కాటు వ‌ల్ల మ‌ర‌ణించారు. 

భారత్ లో ఉగ్రదాడులకు దావూద్ ఇబ్రహీం ప్లాన్.. పాకిస్థాన్ కేంద్రంగా స్పెషల్ యూనిట్.. వెల్లడించిన సలీం ఖురేషీ..

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని బలరాంపూర్ జిల్లా లాలియా ప్రాంతంలోని భవానీపూర్ గ్రామానికి చెందిన అర‌వింద్ మిశ్రా (38) మంగ‌ళ‌వారం పాము కాటుకు గుర‌య్యాడు. దీంతో అత‌డిని వెంట‌నే జిల్లా ఆస్పత్రికి త‌ర‌లించారు. మెరుగైన చికిత్స కోసం అక్క‌డి నుంచి బహ్రైచ్‌కు తీసుకెళ్లారు. అయితే అక్క‌డ చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించ‌డంతో బుధవారం మ‌ర‌ణించారు. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్‌లోని లూథియానా ప్రాంతంలోని అత‌డి సోద‌రుడు గోవింద్ మిశ్రా (32) అంత్య‌క్రియ‌ల కోసం భ‌వానీపూర్ వ‌చ్చారు. అత‌డి వెంట మ‌రో బంధువు చంద్ర‌శేఖర్ పాండే (22)ను కూడా తీసుకొచ్చారు. 

బుధ‌వారం రోజు అర‌వింద్ మిశ్రా అంత్య‌క్రియలు నిర్వ‌హించారు. అనంత‌రం గోవింద్ మిశ్రా, త‌న బంధువు చంద్ర‌శేఖర్ పాండేతో పాము మిగితా బంధువులు అంతా మృతుడి ఇంట్లో నిద్ర‌పోయారు. అయితే రాత్రి వీరంతా నిద్రిస్తున్న స‌మ‌యంలో ఓ విష‌స‌ర్పం వ‌చ్చి వీరిద్ద‌రిని కూడా కాటేసింది. దీంతో మృతుడి సోద‌రుడు గోవింద్ మిశ్రా మృతి చెందారు. పాండే ను వెంట‌నే హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. అతడి ప‌రిస్థితి కూడా ప్ర‌స్తుతం విష‌మంగా ఉంది.

విద్యుత్ సవరణ బిల్లు 2022కు వ్యతిరేకంగా కేంద్రాన్ని హెచ్చ‌రించిన రైతు సంఘాలు

ఈ సమాచారం అందుకున్న చీఫ్ మెడికల్ ఆఫీసర్, అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. లోక‌ల్ ఎమ్మెల్యే కైలాష్ నాథ్ శుక్లా మృతుల బంధువులను కలుసుకుని వారిని ఓదార్చారు. సీఎంతో మాట్లాడి మృతుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అంద‌జేస్తాన‌ని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ విషసర్పాన్ని వెత‌కాల‌ని ఆరోగ్యశాఖ, అటవీశాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఇలాంటి ఘ‌ట‌నే ఈ ఏడాది మార్చిలో ఆదిలాబాద్ జిల్లాలో జ‌రిగింది. ఓ స్టూడెంట్ ను పాము క‌ర‌వ‌డంతో ఆమె మృతి చెందింది. అయితే ఆమెను అప్ప‌టికే ప‌లు మార్లు పాము కాటుకు గురై ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. బేల మండ‌లం బెదోడ గ్రామానికి చెందిన ప్రణాళి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో గ్రాడ్యుయేష‌న్ చ‌దివేది. ఆమెకు త‌న ఇంట్లో ఉన్న స‌మ‌యంలోనే గ‌తంలో రెండు సార్లు పాము క‌రిచింది. హాస్పిటల్ లో చికిత్స తీసుకొని త‌రువాత కోలుకుంది. 

ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం.. పార్ల‌మెంట్ లో విప‌క్షాల నిర‌స‌న‌లు

మార్చి 18వ తేదీన ఎప్ప‌టిలాగే కాలేజీకి వెళ్లింది. ఆ స‌మ‌యంలో హోలీ పండ‌గ ఉండ‌టంతో జిల్లా కేంద్రం నుంచి వ‌చ్చేట‌ప్పుడే రంగులు కొనుగోలు చేసి బ్యాగ్ లో పెట్టుకొని ఇంటికి వ‌చ్చింది. సాయంత్రం బ్యాగ్ ను ఇంట్లో పెట్టింది. కొంత స‌మ‌యం త‌రువాత బ్యాగ్ లో నుంచి రంగులు తీద్దామ‌నుకుంటున్న స‌మ‌యంలో పాము కాటు వేసింది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న రిమ్స్ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న ఆ స‌మ‌యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విషాదం నింపింది.