పాము కాటే కాదు దోమ కాటు కూడా ప్రాణాల మీదికి తీసుకొస్తుంది. యూకేకు చెందిన ఓ ట్రైనీ పైలెట్ దోమ కాటుతోనే గతేడాది చనిపోయింది. ఈ మరణానికి కారణాలు తెలియజేస్తూ తాజాగా నివేదిక విడుదలయ్యింది. 

పాము కాటుకో లేక మ‌రేదైన విష కీట‌క‌మో కుడితే చ‌నిపోయిన ఘ‌ట‌న‌లు మ‌నం త‌ర‌చూ చూస్తుంటాం. కానీ కేవ‌లం దోమ కాటు (Mosquito bite)తో మ‌ర‌ణించారాని ఎప్పుడైనా విన్నారా.. ? దోమ కాటేస్తే దుద్దుర్లు వ‌స్తాయి.. కొన్ని సార్లు జ్వరం లాంటివి కూడా వ‌స్తాయి కానీ ఏకంగా ప్రాణాల మీదికి అయితే రాదు క‌దా.. కానీ యూకేలో ఓ యువ‌తికి ఇలాగే జ‌రిగింది. ఆమె ఎక్క‌డో కొండ కోన‌ల్లో, ఆధునిక వైద్యానికి దూరంగా నివ‌సించే మ‌హిళ అనుకుంటే పొర‌పాటే. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే పైలెట్ గా ఉద్యోగం చేస్తున్నారామే. అంటే ఆమెకు అన్నిర‌కాల వైద్య స‌దుపాయాలు అందుబాటులో ఉంటాయి. అలాంటి పైలెట్ కేవ‌లం దోమ కాటు వ‌ల్ల మ‌ర‌ణించింది. అస‌లేం జ‌రిగిందో తెలుసుకోవాలంటే ఇది చ‌దివేయండి..

ఉత్తరాఖండ్ లో నదిలో కొట్టుకుపోయిన కారు, 9మంది మృతి

బీబీసీతో పాటు ప‌లు అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. ఓరియానో పెప్ప‌ర్ (Oriana Pepper) అనే యువ‌తి ట్రైనీ పైలెట్ (Trainee pilot) గా ప‌ని చేస్తున్నారు. ఆమె బ్రిట‌న్ కు దేశానికి చెందినది, అయితే అంత వ‌ర‌కు ఆరోగ్యంగా ఉన్న ఆమె గ‌తేడాది జూలైలో బెల్జియంలో అన్యూహంగా మ‌ర‌ణించారు. ఆమె మృతికి కార‌ణం ఏంట‌నే విష‌యాన్ని తెలుసుకునేందుకు అధికారులు ద‌ర్యాప్తు జరిపారు. దీనికి సంబంధించిన నివేదిక‌లు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో షాకింగ్ విష‌యాలు వెలుగు చూశాయి. 

Indian Railway: 10 నెలల చిన్నారికి ఉద్యోగమిచ్చిన రైల్వే శాఖ.. కార‌ణం తెలిస్తే క‌న్నీరు ఆగ‌దు..

మ‌ర‌ణానికి ముందు ఆమెను ఓ దోమ కాటేసింది. దీంతో ఆమె కుడి కంటికి వాపు వ‌చ్చింది. దీనిని గ‌మ‌నించిన ఆమె బాయ్ ఫ్రెండ్ వెంట‌నే హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. అయితే అక్క‌డి డాక్ట‌ర్లు ఆమెను ప‌రీక్షించి మాములుగా యాంటిబ‌యోటిక్స్ ఇచ్చారు. దీంతో ఆమె ఇంటికి తిరిగి వ‌చ్చింది. కానీ రెండు రోజుల‌కు ఆమె ఆరోగ్య ప‌రిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. సాధార‌ణ ప‌నులు చేసుకుంటుండ‌గా స్పృహత‌ప్పి ప‌డిపోయింది. దీంతో ఆమెను మ‌ళ్లీ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. ఈ సారి డాక్ట‌ర్లు ఆమెను అడ్మిట్ అవ్వాల‌ని సూచించారు. ట్రీట్ మెంట్ మొద‌లైంది. కానీ కొన్ని రోజుల వ్య‌వ‌ధిలోనే ఆమె ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిక‌రంగా మారింది. చివ‌రికి చ‌నిపోయింది.

Mohammed Zubair Case: "ఇది మా అంతర్గత విష‌యం.. మీ జోక్యం అనవసరం": జర్మనీకి ధీటుగా భారత్‌ స‌మాధానం

ఆమె మ‌ర‌ణం ప‌ట్ల దర్యాప్తు చేసిన అధికారులు వారి నివేదిక‌లో ప‌లు విష‌యాలు వెల్ల‌డించారు. ఆమెకు దోమ కాటు వేయ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్ తలెత్తింద‌ని తెలిపారు. ఆ ఇన్ఫెక్ష‌న్ మొద‌కు పాకింద‌ని పేర్కొన్నారు. దీంతో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టింద‌ని తెలిపారు. అదే ఆమె మర‌ణానికి కార‌ణ‌మైంద‌ని వారి నివేదిక‌లో పేర్కొన్నారు.