ఉత్తరాఖండ్ లోని రాంనగర్‌లో పర్యాటకులతో నిండిన కారు నదిలో మునిగిపోయింది, 9 మంది మృతి, 4 మృతదేహాలు స్వాధీనం, ఒక బాలిక రక్షించబడింది

ఉత్తరాఖండ్ : Uttarakhandలో ఈరోజు తెల్లవారుజామున కురిసిన వర్షాల కారణంగా భారీ నీటి ప్రవాహంలో రామనగర్‌లోని ధేలా నదిలో car కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 1 బాలిక సజీవంగా బయటపడింది. 5 మంది వరదనీటిలో చిక్కుకుపోయారు. ఈ మేరకు కుమావోన్ రేంజ్ డిఐజి ఆనంద్ భరన్ ధృవీకరించారు.

ఉత్తరాఖండ్, నైనిటాల్‌లోని రాంనగరక్‌లోని ధేలా నదిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమారం సమయంలో ఎర్టిగా కారు నిండా పర్యాటకులతో నిండి ఉంది. ప్రవాహ ఉధృతికి కారు నదిలో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 9 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. వీరిలో నలుగురి మృతదేహాలు లభ్యం కాగా, ఒక బాలికను రక్షించారు.