Indian Railway: రోడ్డు ప్రమాదంతో తల్లిదండ్రులను కోల్పోయిన ఛత్తీస్‌గఢ్ చెందిన 10 నెలల చిన్నారికి రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చింది. అయితే.. ఆ చిన్నారి 18 ఏళ్లు పూర్తి అయినా తరువాత ఉద్యోగ బాధ్యతల్లో చేరుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలో.. అత్యంత చిన్న వయస్సులో జరిపిన కారుణ్య నియామకం ఇదేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Indian Railway: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల చిన్నారికి రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చింది. అయితే... ఆ చిన్నారి 18 ఏండ్లు నిండిన తరువాత.. ఉద్యోగ బాధ్యతల్లో చేరుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రైల్వే చరిత్రలోనే 10 నెలల చిన్నారికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగం కల్పించడం బహుశా ఇదే తొలిసారి అని రైల్వే అధికారులు చెబుతున్నారు.
వివరాల్లోకెళ్తే.. చిన్నారి తండ్రి రాజేంద్ర కుమార్, భిలాయ్‌లోని రైల్వే యార్డులో అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. కానీ, జూన్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యతో సహా అతడు మరణించారు. ఈ ప్రమాదంలో వారి 10 నెలల ఆ చిన్నారి క్షేమంగా బయటపడింది.
ప్రమాదం జరిగిన తర్వాత, నిబంధనల ప్రకారం రాయ్‌పూర్ రైల్వే డివిజన్ ద్వారా రాజేంద్ర కుమార్ కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందించామని అధికారులు తెలిపారు. అనంతరం రైల్వే రికార్డుల్లో అధికారిక నమోదు కోసం చిన్నారి వేలిముద్రలు తీసుకున్నారు. బొటన వేలి ముద్ర తీసుకునే సమయంలో ఆ చిన్నారి ఏడ్వడం చూసి మా హృదయం ద్రవించింది. ఆ పసిగుడ్డు వేలి ముద్రలు తీసుకోవడం కష్టతరమైందని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటన హృదయాన్ని కదిలించిందని అన్నారు. మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ సాయం అందించడమే కారుణ్య నియామకాల ఉద్దేశం.
చిన్నారి ఉద్యోగం కోసం నమోదు
జూలై 4న, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (AECR), రాయ్‌పూర్ రైల్వే డివిజన్‌లోని పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో కారుణ్య నియామకం కోసం 10 నెలల బాలిక నమోదు చేయబడింది. చిన్నారి తండ్రి రాజేంద్ర కుమార్ భిలాయ్‌లోని రైల్వే యార్డులో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యతో సహా అతడు మరణించగా, ఆ ప్రమాదంలో బాలిక ప్రాణాలతో బయటపడిందని SECR ఓ ప్రకటనలో వెల్లడించింది.
