సముద్రం ఒడ్డున భర్తతో కలిసి ఫొటో తీసుకుంటుండగా విషాదం.. మహిళను లోపలికి లాక్కెళ్లిన భారీ అల.. వీడియో వైరల్

ఓ జంట సముద్రం ఒడ్డున ఒండపై కూర్చొని ఫొటోలు తీసుకుంటుండగా.. ఓ భారీ అల వచ్చి మహిళను లోపలికి లాక్కెళ్లింది. రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. 

Tragedy while taking a photo with her husband on the sea shore.. A huge wave locked the woman inside.. Video viral..ISR

ఫొటో సరదా విషాదం నింపింది. భర్తతో కలిసి ఓ మహిళ ఫొటోలు తీసుకుంటోంది. వెనకాల నుంచి భారీ అలలు వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చేయాలని పలువురు పర్యాటకులు హెచ్చరిస్తున్నా.. వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఓ భారీ అల వచ్చి వారిని తాకింది. దీంతో ఆ మహిళ నీటిలో కొట్టుకోపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. 

సింధ్ నదిలోకి దూసుకెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం.. 8 మందికి గాయాలు

వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని గౌతమ్ నగర్ లో ముఖేష్ సోనార్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య జ్యోతి సోనార్ (27), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు గత ఈ నెల 9వ తేదీన ఆదివారం ముంబైలోని బాంద్రాలో పోర్టుకు విహారయాత్రకు వెళ్లారు. సముద్రపు తీరాన కూర్చొని సరదాగా గడిపారు.

ఈ క్రమంలో ముఖేష్, జ్యోతి దంపతులు ఇద్దరూ సముద్రపు ఒడ్డున ఉన్న ఓ బండపై కూర్చొని ఫొటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో వెనకాల నుంచి సముద్రపు అలలు వస్తున్నాయి. ఇలా అలలు వచ్చి వారిని తాకుతున్నా అక్కడి నుంచి భార్యభర్తలు కదలలేదు. ఫొటోలకు స్టిల్స్ ఇవ్వడంలో నిమగ్నమయ్యారు. ఒడ్డు నుంచి వారి పిల్లలు వచ్చేయాలని కోరుతున్నా వారు వినిపించుకోలేదు.

మణిపూర్ లో కొనసాగుతున్న హింస.. ఇంట్లోనే మహిళను దారుణంగా కాల్చి చంపిన దుండగులు

సముద్రపు అలల తీవ్రతను గమనించిన మరి కొందరు కూడా వచ్చేయాలని సూచించారు. కానీ ఆ జంట ఫొటోలపైనే దృష్టి పెట్టింది. అప్పటికే పలు అలలు తీవ్రతతో వారిని తాకి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఓ భారీ అల వచ్చి భార్యాభర్తలను ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ అల వెనక్కి వెళ్తూ జ్యోతిని కూడా వెంట తీసుకెళ్లింది. ముఖేష్ ఆమెను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు కానీ అందులో విఫలమయ్యాడు.

వారెవ్వా.. జాబిల్లిపై భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ముద్రించనున్న చంద్రయాన్- 3 రోవర్

ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వారు ఆమెను కాపాడాలేకపోయారు.  కాగా.. భార్య భర్తలు రాయిపై కూర్చొని ఫొటోలు దిగడం, అలలు ఆ మహిళను వెంట తీసుకెళ్లడాన్ని అక్కడున్న పలువురు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios