మణిపూర్ లో కొనసాగుతున్న హింస.. ఇంట్లోనే మహిళను దారుణంగా కాల్చి చంపిన దుండగులు

మణిపూర్ లో హింస కొనసాగుతోంది. ఇంట్లోకి చొరబడి మరీ పలువురు దుండగులు ఓ మహిళలను దారుణంగా కాల్చి చంపాడు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా సావోంబంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

The ongoing violence in Manipur.. The thugs brutally murdered a woman at home..ISR

మణిపూర్ లో ఇంకా హింస కొనసాగుతోంది. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా సావోంబంగ్ ప్రాంతంలో 50 ఏళ్ల వయసున్న మహిళ ముఖంపై కాల్పులు దుండుగులు కాల్పులు జరిపారు. ఆమె ఇంట్లోకి చొరబడి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆమె ముఖాన్ని వికృతంగా మార్చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే మణిపూర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సమీప ప్రాంతంలోని కొన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.

వారెవ్వా.. జాబిల్లిపై భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ముద్రించనున్న చంద్రయాన్- 3 రోవర్

ఈ ఘటనలో చనిపోయిన మహిళ కొంత మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ మహిళ మారింగ్ నాగా కమ్యూనిటీకి చెందినది తెలుస్తోంది. అయితే ఆ ఆ మహిళ ఎవరనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ హత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రజల వాంగ్మూలాలు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విద్వేషపూరిత ప్రసంగాల కేసు.. దోషిగా తేలిన సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్.. రెండేళ్ల జైలు శిక్ష ఖరారు..

మరో ఘటనలో పార్క్ చేసిన ట్రక్కులను కూడా దుండగులు తగులబెట్టారు. ఇంఫాల్ (డబ్ల్యూ) నుంచి నేషనల్ హైవే -2 మీదుగా వెళ్తున్న సిలిండర్లను తీసుకెళ్లడానికి ఉపయోగించే ట్రక్కులను బహిరంగ మైదానంలో నిలిపి ఉంచారు. ఈ సమయంలో వాటికి నిప్పంటించారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిని ఇంకా గుర్తించలేదని, ట్రక్కులకు ఎందుకు నిప్పుపెట్టారో స్పష్టంగా తెలియదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

దారుణం.. గవర్నమెంట్ స్కూల్ టీచర్ హత్య.. విజయనగరంలో ఘటన

కాగా.. మణిపూర్ లో పరిస్థితులు అనుకూలించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించింది. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇచ్చినవి మినహా అన్ని ప్లాట్ ఫామ్ లు, అన్ని సర్వీస్ ప్రొవైడర్లలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. అధికారులు ఆమోదించిన కేస్-టు-కేస్ ప్రాతిపదికన ఇంటర్నెట్ లీజ్ లైన్ (ఐఎల్ఎల్) వినియోగదారులను కూడా నిషేధం నుండి మినహాయించారు.

నటీ నటులు 30 రోజులు టమాటాలు తినకపోతే శరీరంలో ప్రోటీనేం తగ్గిపోదు - మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ముండే..

మే 3న మీటీలను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ కు నిరసనగా ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ (ఏటీఎస్ యూ) నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో రాష్ట్రంలో హింస చెలరేగింది. మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు - నాగాలు, కుకిలు - జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు. కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios