సింధ్ నదిలోకి దూసుకెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం.. 8 మందికి గాయాలు

జమ్మూకాశ్మీర్ లో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం సింధ్ నదిలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న 8 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. 

The vehicle in which the CRPF jawans were traveling plunged into the Sindh river. 8 people were injured..ISR

జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. గందర్బల్ జిల్లా బల్తాల్ సోన్మార్గ్ ప్రాంతంలోని నీల్ గార్ హెలిప్యాడ్ సమీపంలో సింధ్ నదిలోకి ఓ వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో అందులో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఎనిమింది జవాన్లకు గాయాలు అయ్యాయి. 

మణిపూర్ లో కొనసాగుతున్న హింస.. ఇంట్లోనే మహిళను దారుణంగా కాల్చి చంపిన దుండగులు

వాహనం బల్తాల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను బల్తాల్ లోని బేస్ క్యాంప్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మే నెలలో జరిగిన ఇదే జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు అయ్యాయి. మే 25వ తేదీన పుల్వామాలోని  పండ్ల లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి.. రోడ్డుకు అవతలి వైపు ఉన్న సీఆర్పీఎఫ్ వాహనానికి ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అందులో ఉన్న సీఆర్పీఎప్ జవాన్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన అవంతిపొరలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

వారెవ్వా.. జాబిల్లిపై భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ముద్రించనున్న చంద్రయాన్- 3 రోవర్

గాయపడిన ముగ్గురు జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వెలుగులోకి వచ్చింది. రోడ్డుకు ఒకవైపు సీఆర్పీఎఫ్ వాహనం నిలబడి ఉండగా, అకస్మాత్తుగా మరోవైపు నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు సీఆర్పీఎఫ్ వాహనాన్ని బలంగా ఢీకొట్టి.. అనంతరం బోల్తా పడటం కనిపించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios