విషాదం.. రిటైర్డ్ ఏసీపీ ప్రదీప్ టెంకర్ ఆత్మహత్య..
ఏసీపీగా సేవలు అందించి, ఉద్యోగ విరమణ పొందిన ప్రదీప్ టెంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహారాష్ట్రలోని ముంబాయిలో ఉన్న తన నివాసంలోనే ఆయన ఆత్మహత్యకు ఒడిగట్టారు.
రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ప్రదీప్ టెంకర్ (70) ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలోని ముంబాయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన తన ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టెంకర్ ను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
telangana weather : తెలంగాణలో మొదలైన చలి.. గజగజ వణుకుతున్న పల్లెలు..
అయితే డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనను రక్షించలేకపోయారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో ప్రాణాంతకంగా మారి టెంకర్ చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. ఈ ఆత్మహత్యపై వెంటనే స్పందించిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. మాతుంగా పోలీస్ స్టేషన్ లో ఏడీఆర్ కింద కేసు నమోదు చేశారు.
వరంగల్ లో విషాదం.. పండగ కోసం హైదరాబాద్ నుంచి ఊరికి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి..
కాగా.. టెంకర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్న విషయం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. పోలీసులు ఉన్నతాధికారిగా సేవలు అందించిన ఆయన మరణం స్థానికంగా విషాదాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.