వరంగల్ లో విషాదం.. పండగ కోసం హైదరాబాద్ నుంచి ఊరికి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి..
దసరా పండగ పూట వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు మరణించారు. అల్లుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది. దసరా పండగ కోసం ఓ యువతి తన భర్తను తీసుకొని స్వగ్రామానికి బయలుదేరింది. బస్సు దిగి బస్టాండ్ లో ఎదురు చూస్తున్నారు. కొంత సమయం తరువాత ఆ యువతి తండ్రి బైక్ పై వారి కోసం వచ్చారు. వారు ముగ్గురు బైక్ పై ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆ బైక్ ను కారు ఢీకొట్టడంతో తండ్రీకూతుర్లు మరణించారు.
బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం: 15 మంది మృతి, పలువురికి గాయాలు
వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా కిష్టాపురం మండలంలోని మొరిపిరాల గ్రామంలో ఓరుగంటి వెంకన్న నివసిస్తున్నారు. ఆయనకు 33 ఏళ్ల అనూష అనే కూతురు ఉన్నారు. ఆమెకు ముంజపల్లి రాజు అనే యువకుడితో కొంత కాలం కిందట వివాహం జరిగింది. ఈ దంపతులు హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. దసరా కోసం ఆ జంట మొరిపిరాల గ్రామానాకి బయలుదేరింది.
బీజేపీకి నటి గౌతమి గుడ్ బై.. కారణమేంటంటే ?
ఈ దంపతులు హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చి తొర్రూరు బస్ స్టాండ్ లో దిగారు. కాగా.. ఇదే సమయంలో వెంకన్న కూతురు, అల్లుడి కోసం బైక్ పై తొర్రూరుకు చేరుకున్నారు. ఇద్దరినీ బైక్ పై ఎక్కించుకొని గ్రామానికి బయలుదేరారు. అయితే బైక్ కిష్టాపురం క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే ఓ కారు ఢీకొట్టింది. దీంతో వెంకన్న ఘటనా స్థలంలోనే మరణించారు. అనూష, రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వారిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
వీధి కుక్కల దాడిలో వాఘ్ బక్రీ టాప్ ఎగ్జిక్యూటివ్ పరాగ్ దేశాయ్ మృతి..
అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే అనూష పరిస్థితి విషమించడంతో మరణించారు. రాజు ప్రస్తుతం చికిత్స పొందుతున్నప్పటికీ.. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది. పండగ పూట తండ్రీకూతుర్లు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు.