telangana weather : తెలంగాణలో మొదలైన చలి.. గజగజ వణుకుతున్న పల్లెలు..
తెలంగాణలో ఒక్క సారిగా ఊష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శీతల గాలులు మొదలయ్యాయి. దీంతో ఉత్తర తెలంగాణ, ఏజెన్సీ గ్రామాల్లోని పల్లెలు చలికి వణుకుతున్నాయి. పగటి పూట ఊష్ణోగ్రతలు కూడా తగ్గాయి.
తెలంగాణలో చలి మొదలైంది. అక్టోబర్ మొదలైనప్పటికీ ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు.. గత మూడు రోజుల నుంచి ఊష్ణోగ్రతలు తగ్గడంతో కాస్త ఉపషమనం పొందుతున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వీయడం మొదలయ్యాయి. దీంతో చలి తీవ్రత నెమ్మదిగా ప్రారంభమైంది.
వరంగల్ లో విషాదం.. పండగ కోసం హైదరాబాద్ నుంచి ఊరికి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి..
ఇప్పటికే ఉత్తర తెలంగాణలోని పల్లెలు చలితో గజగజ వణకడం ప్రారంభించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ కాశ్మీర్ గా పిలిచే ఆదిలాబాద్ లో ఇప్పుడే చలి తన పంజా విసరడం ప్రారంభించింది. ఆదివారం ఇక్కడ 1.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అలాగే రామగుండం, మెదక్, హన్మకొండలోనూ పగటి పూట ఊష్ణోగ్రతలు తగ్గిపోయాయి.
కాగా.. హైదరాబాద్ లో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని వాతావరణ శాఖ నివేదికలు పేర్కొన్నాయి. దీంతో రాష్ట్రమంతా శీతాకాలం అనుభవిస్తుంటే.. రాజధాని మాత్రం ఇంకా ఉక్కపోతతో ఇబ్బంది పడుతోంది. భద్రాచలం, ఖమ్మంలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉన్నాయి.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 7 గురు మృతి, 8 మంది పరిస్థితి విషమం...
పెరిగిన చలి ప్రభావంతో ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే చలి మంటలు వేసుకోవడం ప్రారంభించారు. ఈ ప్రాంతాల్లో చలికాలం మొత్తం 10 గంటల వరకు చల్లటి గాలులు వీస్తూనే ఉంటాయి. కొన్ని సార్లు మధ్యాహ్నం సమయంలో కూడా చలిగానే ఉంటుంది. ఆదిలాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో సున్నా డిగ్రీలు కూడా నమోదు అవుతుంటాయి.