న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గల ఇండియా గేట్ సమీపంలో ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్లో తనపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఓ మహిళ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు ేచసింది. 

న్యూఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఐష్ సింఘాల్ ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు. హైసెక్యూరిటీ జోన్ అయిన సెంట్రల్ ఢిల్లీలోని ఓ ఫైవర్ స్టార్ హోటల్లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్, టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తున్న ఓ మహిల సామూహిక అత్యాచారానికి గురైనట్లు పిర్యాదు అందింది.

హోటల్లో గదిని బుక్ చేసుకున్నవారు ఆ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే హోటల్లో టికెట్ బుకింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న మహిళకు డబ్బులు అవసరమని నిందితులు గుర్తించారు.  వెంటనే తక్కువ వడ్డీకి ఆమెకు రుణం ఇప్పిస్తామని చెప్పి ఆమెను తమ హోటల్ గదికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు.

బాధిత మహిళ ఫిర్యాుదుతో ఓ మహిళతో పాటు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనలో ప్రధాన నిందితుడు మనోజ్ శర్మను అరెస్టు చేసి విచారణ సాగిస్తున్నారు.