Asianet News TeluguAsianet News Telugu

April 1st - Top Ten News : టాప్ టెన్ వార్తలు

ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు
 

todays top ten news april 1st ksp
Author
First Published Apr 1, 2024, 9:08 PM IST | Last Updated Apr 1, 2024, 9:23 PM IST

ఏపీలో పింఛన్ కష్టాలు.. పొట్టకొట్టారంటూ జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

రాజకీయ స్వార్ధం కోసం సీఎం జగన్.. పింఛనర్ల పొట్టకొట్టారని.. జనసేన బీజేపీ టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ నేతలు కలెక్టర్లను కలిసి పింఛన్ సొమ్ము అందేలా చొరవ చూపాలని చంద్రబాబు ఆదేశించారు. కూటమి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను ప్రకటిస్తామని చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు.  పూర్తి కథనం 

ఏకంగా విమానాలే ఎగుమతి చేసే స్టేజ్‌కు భారత్ 

భారత్ విమానయాన రంగంలో ఎంతటి అభివృద్ది సాధించిందో తాజా ఘటనతో బయటపడింది. ఇతర దేశాల నుండి రక్షణా, వాయుసేన సామాగ్రిని దిగుమతి చేసుకునే స్థాయినుండి ఇతదేశాలకు విమానాలను అందించే స్థాయికి భారత్ చేరుకుంది. తాజాగా హిందుస్ధాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ దేశీయ సాంకేతికతతో తయారుచేసిన రెండు విమానాలను గయానాకు అందించి చరిత్ర సృష్టించింది. పూర్తి కథనం 

పింఛన్లు ఆపించింది చంద్రబాబే : పేర్నినాని

వాలంటీర్ల సేవల నిలిపివేతకు కుట్ర చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. పెన్షన్లు ఇవ్వకుండా ఆపటం చంద్రబాబు వల్ల కాదని .. గతంలో ఇంటింటికి పింఛను కార్యక్రమాన్ని ఆయన చేపట్టారా అని నాని నిలదీశారు. నిమ్మగడ్డకు ఎవరెవరితో సంబంధాలున్నాయో అందరికీ తెలుసునని పేర్నినాని దుయ్యబట్టారు. పూర్తి కథనం

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ వాయిదా

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం జూన్ 2కు వాయిదా వేసింది. పూర్తి కథనం 

విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతంటే 

రీసెంట్ ఈవెంట్ లో విజయ్ తన రెమ్యునరేషన్ పై స్పందించారు. తన సినిమాకు ఎంత తీసుకుంటున్నారో వివరించారు. ఇండస్ట్రీో ఉన్న రూమర్లను కట్టిపడేస్తూ ఇంట్రెస్టింగ్ గా బదులిచ్చారు. ఖుషి చిత్రం తర్వాత నుంచి నాకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ ను బట్టి పారితోషికం అందుకుంటున్నాను’. అని చెప్పారు. పూర్తి కథనం

మరోసారి అల్లు అర్జున్ కు హీరోయిన్ గా సమంత 

సమంత మరోసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించబోతున్నట్టు న్యూస్ వినిపిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు బన్నీ సరసన సామ్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో సమంత అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావ’ ఐటెమ్ సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.  పూర్తి కథనం

శరత్‌బాబుతో డైవర్స్.. ఆస్తులన్నీపోయాయి 

సీనియర్‌ నటి రమాప్రభ తెలుగులోనే వందల సినిమాలు చేసి మెప్పించింది. హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా, అమ్మగా, అత్తగా, బామ్మగా నటించి మెప్పించింది. ఇప్పుడు వయసు రిత్యా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన పలు షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. తన మాజీ భర్త శరత్‌ బాబు చేసిన మోసాన్ని ఆమె బయటపెట్టింది.  పూర్తి కథనం

రోహిత్ ఖాతాలో మరో చెత్త రికార్డ్...

ఈ ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తడబాటు కొనసాగుతోంది. ఈ సీజన్ లో ముంబైకి ఇప్పటివరకు ఒక్క గెలుపు కూడా లేదు. తాజాగా సొంత మైదానం వాంఖడేలోనూ అదే చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ టీం. మొదటి ఓవర్ లోనే ఓపెనర్ రోహిత్ శర్మను డకౌట్ చేసాడు ట్రెంట్ బౌల్ట్. తాజా  డకౌట్ తో రోహిత్ ఖాతాలో చెత్తరికార్డు చేరింది. పూర్తి కథనం

మనం ఓడిపోయామా..!: ధోనికి సొంత భార్య ట్రోలింగ్

బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న ధోని క్రీజులో వున్నాకూడా సిఎస్కేను గెలిపించలేకపోయారు. ధోని కేవలం 16 బంతుల్లో 37 పరుగులు (4 ఫోర్లు, మూడు సిక్సులు) చేసినా ఇది జట్టును గెలిపించలేకపోయాడు. ఈ పరాజయంపై ధోని భార్య సాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పూర్తి కథనం

నేటి నుండి కొత్త రూల్స్

కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభమైంది. దీనితో పాటు, మీ పాకెట్ బడ్జెట్ ని  ప్రభావితం చేసే అనేక నియమాలు కూడా మారాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో జరిగే నియమాలలో మార్పుల ప్రకారం మీరు మీ చేయాల్సిన  పనిని సకాలంలో పూర్తి చేయడం ముఖ్యం. పూర్తి కథనం
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios