MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శరత్‌బాబుతో డైవర్స్.. ఆస్తులన్నీపోయాయి.. దాని వెనకాల పెద్ద మోసం.. సీనియర్‌ నటి రమా ప్రభ సంచలన విషయాలు వెల్లడి

శరత్‌బాబుతో డైవర్స్.. ఆస్తులన్నీపోయాయి.. దాని వెనకాల పెద్ద మోసం.. సీనియర్‌ నటి రమా ప్రభ సంచలన విషయాలు వెల్లడి

శరత్‌బాబు, రమాప్రభ పెళ్లి చేసుకుని విడిపోయారు. అయితే డబ్బు కోసం మోసం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రమాప్రభ. తోటీ నటీమణులు కుట్రలు చేసినట్టు వెల్లడించింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 01 2024, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్‌ నటి రమాప్రభ తెలుగులోనే వందల సినిమాలు చేసి మెప్పించింది. హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా, అమ్మగా, అత్తగా, బామ్మగా నటించి మెప్పించింది. ఇప్పుడు వయసు రిత్యా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన పలు షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. తన మాజీ భర్త శరత్‌ బాబు చేసిన మోసాన్ని ఆమె బయటపెట్టింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రమా ప్రభ 1966 నుంచి నటిగా రాణిస్తుంది. స్టార్‌గా వెలుగొందుతుంది. నటిగా ఆమె వందల సినిమాల్లో నటించింది. ఆ సమయంలో నటుడు శరత్‌ బాబు తన జీవితంలోకి వచ్చాడు. ఒకరికొకరు ఆకర్షితులయ్యారు. స్నేహం పెరిగింది. దీంతో శరత్‌ బాబుని తన జీవితంలోకి ఆహ్వానించిందట రమా ప్రభ. తాను స్టార్‌గా రాణిస్తున్న సమయంలో శరత్‌ బాబు అప్పుడప్పుడే నటుడిగా నిలదొక్కుంటున్నాడు. 
 

36

దీనిపై రమా ప్రభ స్పందించింది. తమ పరిచయం యాక్సిడెంటల్‌గా పెళ్లి వరకు వెళ్లిందని తెలిపింది. డబ్బు కోసమే తాను పెళ్లి చేసుకున్నాడనే విషయాన్ని తాను చెప్పలేనుగానీ, అవకాశం కోసం మాత్రం వచ్చాడని తెలిపింది రమా ప్రభ. తన వద్ద ఉండి అవకాశాలను ఉపయోగించుకుని ఎదగాలని ప్రయత్నించాడని చెప్పింది. శరత్‌బాబుతో పదహారు సంవత్సరాలు కలిసి ఉన్నామని చెప్పిన ఆమె ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు పూర్తి విరుద్ధమని చెప్పింది. 
 

46

అన్నేళ్లు ఎలా ఉన్నామని అడిగితే, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నామ్‌ కదా, రియల్‌ లైఫ్‌ కూడా యాక్ట్ చేశామని చెప్పింది. అయితే తాను జోవియల్‌ పర్సన్‌ అని, ఎవరైనా బాగా అనిపిస్తే ఓపెన్‌గా మాట్లాడటం తెలుసు. అంతేకాదు రాంగ్‌ ఆలోచనలు ఉండేవి కాదని, తనకు లవ్‌ మీద ఉన్నంత ఇష్టం, సెక్స్ మీద ఉండదని వెల్లడిచింది రమా ప్రభ. ఐదు నిమిషాల సెక్స్ కోసం ప్రేమ మిస్‌ అయిపోతుందని, తేడాలు వస్తాయని, ఆ విషయంలో డిస్టెన్స్ మెయింటేన్‌ చేసేదాన్ని అని వెల్లడించింది రమాప్రభ. 
 

56

తమ మధ్య కొందరు చిచ్చుపెట్టారని, రమా ప్రభ ఆయన్ని చేసుకుందని చాలా మంది నటీనటులు ఈర్ష్యా చెందారని, అబ్బాయిలు తనమీద, అమ్మాయిలు శరత్‌బాబుపై ప్రేమని చూపించేవారని, ఈ క్రమంలో కొందరు తోటీ నటీమణులే కుట్రలు చేశారని, గొడవలకు కారణమయ్యారని తెలిపింది. అంతేకాదు తామిద్దరం విడిపోయే సమయంలో డబ్బు అంతా పోయిందని, అయితే అదంతా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని, లోపల కుట్రలు చేశారని, ఆ విషయం తెలియక తాను ఆస్తులు రాసిచ్చేశారని, చాలా కోల్పోయినట్టు చెప్పింది రమా ప్రభ. ఆ తర్వాత వాళ్లు ఆ కుట్రల ఫలితాలను అనుభవించారని వెల్లడించింది. 
 

66
sarath babu

sarath babu

అయితే డబ్బు కోసం కుట్రలు ఆయనే చేశాడా? లేదంటే ఎవరైనా చేయించారా? అనేది చెప్పనుగానీ, అలాంటిదే జరిగిందని, శరత్‌ బాబు తన ప్రయోజనాల కోసం నా ఫ్యామిలీని కూడా వాడుకున్నాడని, వాళ్లు చదువుకోలేదని, కానీ తన అక్క అనే తనపై  ప్రేమతో అవన్నీ చేశారని, అలా మోసపోవాల్సి వచ్చిందని తెలిపింది రమా ప్రభ. `ఓపెన్‌ హార్ట్ విత్ ఆర్కే` టాక్‌ షోలో ఆమె ఈ సంచలన విషయాలను వెల్లడించింది. శరత్‌బాబు గతేడాది మేలో కన్నుమూసిన విషయం తెలిసిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved