ఎన్నికల ఎఫెక్ట్ : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ వాయిదా

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం జూన్ 2కు వాయిదా వేసింది. 

counting of mlc votes of mahabubnagar local bodies postponed due to election code ksp

ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో వున్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం జూన్ 2కు వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వున్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉపఎన్నిక అనివార్యమైంది.

కాంగ్రెస్ పార్టీ తరపున మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ గౌడ్ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలిచారు. గత గురువారం ఈ స్థానంలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎక్స్అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌ను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios