ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరీమణులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో జరిగింది. వీరంతా గిరిజన కుటుంబానికి చెందినవారు.

మధ్యప్రదేశ్‌లో ఘోరం జ‌రిగింది. ఒకే గిరిజన కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెల్లు చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ ఘ‌ట‌న ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ముగ్గురిలో ఒక‌రికి వివాహం కాగా.. మిగితా ఇద్ద‌రికి వివాహం జ‌ర‌గ‌లేదు. వారిద్ద‌రూ కాలేజీలో చ‌దువుకుంటున్నారు. 

అర్పితా ముఖర్జీ మరో ఇంట్లో రూ. 28 కోట్ల నగదు.. బాత్‌రూమ్‌లో కూడా నోట్ల కట్టలు..

బుధ‌వారం తెల్ల‌వారుజామున మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఖాండ్వా జిల్లాలో కోటఘాట్ గ్రామంలో ఇది చోటు చేసుకుంది. ఇది బాధిత కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. రాత్రి రెండు గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను ఉచ్చులోంచి తొలగించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో పోలీసు అధికారులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

దారుణం.. రైల్వే స్టేష‌న్ మాస్ట‌ర్ల దుశ్చ‌ర్య‌.. మ‌హిళా జ‌ర్న‌లిస్టుపై లైంగిక వేధింపులు

ఘటనా స్థలంలో ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్ లేదా ఇంకా ఎలాంటి ఆధారాలూ లభించలేదని పోలీసులు తెలిపారు. ఇది ఆత్మ‌హ‌త్యనా లేక హత్య‌నా అనేది ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌డం లేదు. ముగ్గురు సోదరీమణుల పేర్లు సోను, సావిత్రి, లలిత అని జావర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శివరామ్ జాట్ తెలిపారు. వీరి తండ్రి జంసింగ్ 4 సంవ‌త్స‌రాల క్రిత‌మే చనిపోయారు. 

మృతుల్లో సోనూకు 23 ఏళ్లు, సావిత్రికి 21 ఏళ్లు, లలితకు 19 ఏళ్లు అని ఖాండ్వా పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ తెలిపారు. ముగ్గురు అక్కాచెల్లెళ్లు తాడుకు వేలాడుతూ క‌నిపించార‌ని చెప్పారు. వీరంతా తల్లితో కలిసి భామ్‌గర్ గ్రామంలోని కోట ఫాల్యాలో నివ‌సించేవార‌ని చెప్పారు. వీరికి మొత్తంగా 8 మంది తోబుట్టువులు ఉన్నార‌ని తెలిపారు. ఇప్పుడు మృతి చెందిన వారిలో ఇద్ద‌రికి వివాహం జ‌ర‌గ‌లేదని, ప్రాథ‌మికంగా ఇది ఆత్మ‌హ‌త్య‌గా భావిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లో విచిత్రం.. మర్డర్ కేసులో జైల్లో ఉన్న నిందితుడు.. పంచాయతీ ప్రెసిడెంట్‌గా విజయం

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే 9152987821 అనే ప్ర‌భుత్వ హెల్ప్ లైన్ నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు.