4 కేజీల గంజాయిని కారులో తరలిస్తు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, మరో బీటెక్ గ్రాడ్యుయేట్ పట్టుబడ్డారు. ఏపీలోని సీలేరు జెన్‌కో చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇది వెలుగులోకి వచ్చింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చారు. 

వారంతా ఉన్నత చదువులు పూర్తి చేశారు. మంచి ఉద్యోగాలు సంపాదించారు. మంచి ప్యాకేజీతో విలాసవంతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. అయినా వీటన్నింటితో వారు సంతృప్తి చెందలేదు. ఇంకా ఏదో ఆనందం కోసం ఆరాటపడి గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు. గంజాయిని తీసుకొచ్చేందుకు ఎంతదూరమైన వెళ్లేందుకు అయినా సిద్ధమయ్యేవారు. అయితే ఇలా గంజాయి తీసుకొస్తున్న సమయంలో పోలీసులకు చిక్కారు.

వార్నీ.. పేషెంట్ బాధతో అల్లాడిపోతున్నాడని మద్యం తాగించిన అంబులెన్స్ డ్రైవర్.. సోషల్ మీడియాలో వైరల్

వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు జెన్‌కో చెక్ పోస్టు వద్ద పోలీసులు మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఈ ముగ్గురు వయస్సు 25 ఏళ్ల లోపే ఉంటుంది. మొదట పోలీసులు కారును ఆపారు. ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. తాము హైదరాబాద్ కు చెందిన వారిమని, ఈ ప్రాంతాలకు పర్యటన నిమిత్తం వచ్చామని చెప్పారు.

అధికారంలో వున్న వాళ్లు ప్రజలకు సేవకులు : క్రిస్మస్ వేడుకల్లో జగన్

అయితే వారి తీరుతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో కారును మొత్తం తనిఖీ చేశారు. దీంతో అందులో 4 కేజీల గంజాయి దొరికింది. దీంతో పోలీసులు వారిని విచారించారు. గూడెం కొత్తవీధిలోని చల్లనిశిల్ప గ్రామంలో గంజాయిని కొనుగోలు చేశామని తెలిపారు. దానిని హైదరాబాద్ కు తీసుకెళ్తున్నామని చెప్పారు.

దారుణం.. ఇసుక అక్రమ తరలింపును ఆపినందుకు.. కానిస్టేబుల్ పై ట్రాక్టర్ ఎక్కించిన డ్రైవర్

అయితే ఇందులో ఉన్న ఓ నిందితుడు హైదరాబాద్ సిటీని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన గండికోట లక్ష్మీసాయి అని పోలీసులు గుర్తించారు. అలాగే మరొకరు ఏపీలోని పల్నాడు డిస్ట్రిక్ట్ నరసరావుపేటకు చెందిన సీహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి అని తెలిపారు. అలాగే ఇంకొకరు షేక్‌ కిజార్‌ అహ్మద్‌ అని చెప్పారు. అయితే ఇందులో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారని తెలిపారు. ఇంకో వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ ఛార్జ్‌షీట్‌లో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు... సెల్‌ఫోన్ల ధ్వంసం, షేర్ల ప్రస్తావన

ఈ ముగ్గురికి గంజాయిని అందించింది బి.కున్నులు అని పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి 4 కిలోల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్స్, ఓ కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇందులో ప్రమేయం ఉన్న నలుగురిని అరెస్టు చేశామని, వారిని కోర్టుకు తీసుకెళ్లామని పేర్కొన్నారు. ఇంకొకరు పరారీలో ఉన్నారని చెప్పారు.