Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. పేషెంట్ బాధతో అల్లాడిపోతున్నాడని మద్యం తాగించిన అంబులెన్స్ డ్రైవర్.. సోషల్ మీడియాలో వైరల్

ఓ అంబులెన్స్ డ్రైవర్ చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కాలు విరిగి నొప్పితో బాధపడుతున్నాడని మార్గమధ్యంలో అంబులెన్స్ ఆపి పేషెంట్ కు మద్యం తాగించాడు. అనంతరం ఆయన కూడా తాగాడు. 

Drunken ambulance driver saying that the patient was shaking with pain.. Viral on social media
Author
First Published Dec 21, 2022, 7:36 AM IST

ఓ వ్యక్తి చెట్టు పైనుంచి జారి కింద పడ్డాడు. దీంతో కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ అంబులెన్స్ కు కాల్ చేశారు. దీంతో ఓ అంబులెన్స్ వచ్చింది. కుటుంబ సభ్యులు బాధితుడిని అందులోకి ఎక్కించారు. డ్రైవర్ వాహానాన్ని స్టార్ట్ చేసి ప్రయాణం ప్రారంభించాడు. అయితే కొంత దూరం వెళ్లిన తరువాత ఏమైందో తెలియదు గానీ ఆ అంబులెన్స్ డ్రైవర్ వాహనం నుంచి దిగాడు. ఓ గ్లాస్ తీసుకొని అందులో మద్యం పోసి పేషెంట్ కు తాగించాడు. అనంతరం అతడూ తాగాడు. అయితే ఈ తతంగాన్ని పలువురు ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఇప్పడవి వైరల్ గా మారాయి.

రాహుల్ గాంధీ అసలు మనిషే అయితే.. అక్కడి నుంచి పోటీ చేయాలి: సవాల్ విసిరిన బీజేపీ

ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాలోని పరదీప్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏదో పని నిమిత్తం చెట్టు ఎక్కాడు. అక్కడి నుంచి అదుపుతప్పి కింద పడ్డాడు. బాధతో అల్లాడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అంబులెన్స్ ను పిలిపించారు. అందులో బాధితుడిని కటక్‌లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని భావించారు.

అయితే అంబులెన్స్ లో సరళ చౌక్‌ ప్రాంతానికి చేరుకున్న తరువాత ఆ డ్రైవర్ దిలీప్‌ రాధ వాహనాన్ని ఆపాడు. కిందికి దిగాడు. తన వద్ద ఉన్న మద్యాన్ని తీసుకొని పేషెంట్ కు ఇప్పించాడు. ఈ సమయంలో ఆ అంబులెన్స్ లో ఉన్న కుటుంబ సభ్యులకు ఏం అర్థం కాలేదు. పేషెంట్ కు మద్యం తాపిన తరువాత ఆ డ్రైవర్ కూడా మద్యం తాగాడు. అనంతరం వాహనాన్ని ముందుకు కదిలించాడు. 

యుక్తవయస్సు ప్రమాదకరం,18 ఏళ్లలోపు విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం సరికాదు: హైకోర్టు కు కేరళ వర్సిటీ వివరణ

డ్రైవర్ ఇలా అంబులెన్స్ దిగడం, పేషెంట్ కు మద్యం తాగించి, తనూ తాగడం వంటి దృశ్యాలను పలువురు చిత్రీకరించారు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ గా మారాయి. దీంతో అసలేం జరిగిందని మీడియా డ్రైవర్ కు కాల్ చేసి వివరాలను ఆరా తీసింది. తాను డ్రైవ్ చేస్తున్నప్పుడు పేషెంట్ తీవ్రమైన బాధతో అల్లాడిపోయాడని అన్నారు. అంబులెన్స్ ను వేగంగా నడిపితే బాధ ఇంకా ఎక్కువవుతోందని, పది కిలో మీటర్ల స్పీడ్ కంటే మించకూడదని అరిచాడని తెలిపారు. దీంతో పేషెంట్ కు నొప్పి నుంచి కొంత రిలీఫ్ కలిగించేందుకు తాను ఇలా మద్యం తాగించానని చెప్పాడు. తరువాత తాను తాగానని వెల్లడించాడు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios