Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఇసుక అక్రమ తరలింపును ఆపినందుకు.. కానిస్టేబుల్ పై ట్రాక్టర్ ఎక్కించిన డ్రైవర్

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు ఓ కానిస్టేబుల్ పైకి ట్రాక్టర్ ఎక్కించాడు ఓ డ్రైవర్. దీంతో ఆయన కాళ్లు విరిగిపోయాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

Atrocious.. for stopping the illegal movement of sand.. the driver who loaded the tractor on the constable
Author
First Published Dec 21, 2022, 6:57 AM IST

ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ అడ్డం వచ్చిన వారిని బెదిరిస్తున్నారు. దౌర్జ్యానాలకు దిగుతున్నారు. అయితే ఇలాంటివన్నీ సామాన్యులపైనే జరుగుతాయనకుంటే పొరపాటే. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇసుక అక్రమ రవాణాను ఆపుదామని ప్రయత్నించిన కానిస్టేబుల్ ను డ్రైవర్ ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. దీంతో ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి.

రాహుల్ గాంధీ అసలు మనిషే అయితే.. అక్కడి నుంచి పోటీ చేయాలి: సవాల్ విసిరిన బీజేపీ

వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌ డిస్ట్రిక్ట్ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందర్ చేడ్ అనే గ్రామం తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఇసుక అక్రమంగా రవాణా అవుతోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో బషీరాబాద్ పోలీసు స్టేషన్ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు శంకర్ నాయక్, శివరాం ఇందర్ చేడ్ గ్రామంలో నిఘా ఉంచారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ ఛార్జ్‌షీట్‌లో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు... సెల్‌ఫోన్ల ధ్వంసం, షేర్ల ప్రస్తావన

ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో కర్ణాటక బార్డర్ లోని ఆవులం గ్రామం నుంచి ఓ ట్రాక్టర్ ఇసుక లోడ్ తో ఇందర్ చేడ్ కు చేరుకుంది. దీంతో ఆ ట్రాక్టర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక ఎక్కడి నుంచి తెస్తున్నారని, ఎక్కడికి తరలిస్తున్నారని, పర్మిషన్ ఉందా వంటి అన్ని వివరాలను పోలీసులు అడిగారు. దీంతో ఆగ్రహించిన ట్రాక్టర్ డ్రైవర్.. ‘‘మీకెందుకు వివరాలు చెప్పాలి ? వాహనానికి అడ్డు తప్పుకోండి’’ అంటూ హెచ్చరించాడు. 

రియల్ మోసాలు : పోలీసుల అదుపులో సాహితీ లక్ష్మీనారాయణ భార్య .. పరారీలో కుమారుడు, డైరెక్టర్లు

ఇలా మాట్లాడుతున్న సమయంలోనే కోపంతో ఆ డ్రైవర్ ట్రాక్టర్ ను కానిస్టేబుల్  శంకర్‌ మీదికి పోనిచ్చాడు. దీంతో ఆయన కాళ్లు ట్రాక్టర్ కింద పడి నుజ్జునుజ్జయ్యాయి. దీంతో ఆయన అక్కడే కిందపడిపోయాడు. రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో మరో కానిస్టేబుల్ స్థానిక గ్రామస్తుల సాయంతో బాధితుడిని హైదరాబాద్ లోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన అక్కడి చికిత్స పొందుతున్నాడు.

ఢిల్లీ వేదికగానే బీఆర్ఎస్ విస్తరణ వ్యూహాలు.. నెలాఖరులో కేసీఆర్ ప్రెస్‌మీట్, విధివిధానాలు ప్రకటించే ఛాన్స్

అయితే కానిస్టేబుల్ ను ఢీకొట్టిన అనంతరం ఆ డ్రైవర్ వాహానాన్ని వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో ఇందర్‌చేడ్‌ శివారు కెనాల్ కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా పడింది. వెంటనే డ్రైవర్, దానిపై ఉన్న మరో వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రిజిస్టర్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకున్న ప్రాంతాన్ని డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, సీఐ రాంబాబు పరిశీలించారు. స్థానికులను, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు విచారణలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios