Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం : ఈడీ ఛార్జ్‌షీట్‌లో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు... సెల్‌ఫోన్ల ధ్వంసం, షేర్ల ప్రస్తావన

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించింది. సమీర్ కంపెనీల్లో కవితకు 35 శాతం వాటా వుందని .. కవిత వాడిన పది మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

 enforcement directorate mentioned brs mlc kalvakuntla kavitha name again in delhi liquor scam
Author
First Published Dec 20, 2022, 10:19 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించడం కలకలం రేపుతోంది. సమీర్ మహేంద్రు కేసులో ఈ ఛార్జ్‌షీట్‌ను ఈడీ దాఖలు చేసింది. కవిత వాడిన పది మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. కవితతో పాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తం గౌతమ్, అరుణ్ చంద్ర పిళ్లై, అభిషేక్ రావు పేర్లను ఛార్జ్‌షీటులో ప్రస్తావించింది ఈడీ. 

సమీర్ కంపెనీల్లో కవితకు 35 శాతం వాటా వుందని తెలిపింది ఈడీ. అలాగే శరత్ చంద్రారెడ్డి చేతుల్లో వున్న ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ రావు నడిపిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్‌లో సమీర్ మహేంద్రను మాగుంట శ్రీనివాసులు రెడ్డిలతో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్, బుచ్చిబాబులు కలిసినట్లు ఈడీ తెలిపింది. 

కాగా... కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కేసులో డిసెంబర్ 11న సీబీఐ బృందం సుదీర్ఘంగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూపుగా చెబుతున్న వారితో కవితకు ఏమైనా పరిచయం ఉందా? ఎప్పుడైనా వారిని కలిశారా? ఈ మధ్యకాలంలో కవిత ఎందుకు ఫోన్లు మార్చాల్సి వచ్చింది? ఇలాంటి అనేక అంశాలపై  సిబిఐ  అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఈ కేసులో గతంలో అరెస్టయిన నిందితుడు అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక ప్రశ్నలు వేశారు. వీటికి ఆమె ఇచ్చిన సమాధానాలు  రికార్డు చేసుకున్నట్లు  సమాచారం.

Also REad: సీఆర్పీసీ సెక్షన్ 91కింద ఎమ్మెల్సీ కవితకు మరో నోటీసు ఇచ్చిన సీబీఐ.. ‘సౌత్ గ్రూప్’ విషయంలో ఆరా...!

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడైన అమిత్ అరోరాను రిమాండ్ చేసి కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్ కీలకంగా ఉంది. ఈ గ్రూపును నియంత్రిస్తున్న వారిలో కవిత కూడా ఉన్నారని అమిత్ అరోరా ఈడికి చెప్పారని ఆ రిపోర్ట్ లో పేర్కొంది. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేదు. కాకపోతే అమిత్ అరోరా  స్టేట్మెంట్ ఈడి రిమాండ్ రిపోర్టు ఆధారంగా  సీబీఐ కవితను ప్రశ్నించాలని నిర్ణయించింది. 

ఈ మేరకు 160 ఆర్ పిసి కింద కవితకు ఈ నెల 2న నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొదట డిసెంబర్ ఆరవ తేదీన విచారణ చేపడతామని తెలిపిన సిపిఐ…ఆ తర్వాత ఆయా తేదీల్లో తనకు పని ఉందని కవిత చెప్పిన సూచనల ప్రకారం 11వతేదీ ఆదివారం ఉదయం విచారణ చేపట్టింది. విచారణ సమయంలో కవిత తరఫు న్యాయ సలహాదారులు కూడా ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios