Asianet News TeluguAsianet News Telugu

ఆర్థిక మాంద్యం ముప్పు: ఉద్యోగుల‌కు షాకిస్తున్న కంపెనీలు.. స్పాటిఫై లో 6 శాతం ఉద్యోగాలు కట్ !

New Delhi: మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై (Spotify) తన వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాందోళన అంచనాల మధ్య తమ ఉద్యోగులను తగ్గించుకునే చర్యలు చేపట్టాయి. వాటిలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, షేర్ చాట్, గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. 
 

Threat of economic recession: Companies shocking employees; Spotify laid off 6% of employees
Author
First Published Jan 23, 2023, 7:52 PM IST

Spotify to lay off 6% of employees: రానున్న ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాందోళన అంచనాల మధ్య తమ ఉద్యోగులను తగ్గించుకునే చర్యలు చేపట్టాయి. వాటిలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, షేర్ చాట్, గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం స్పాటిఫై (Spotify)  చేరింది. స్పాటిఫై (Spotify) తన వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

వివరాల్లోకెళ్తే.. మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం Spotify తన వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు టెక్ పంపెనీలు తమ కంటెంట్ తో మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీలలో ఎక్కువ వర్కర్స్  పని చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే రెండేళ్ల కాలంలో ఇలాంటి కంపెనీలు మంచి వృద్ధిని నమోదు చేశాయి. దీంతో ఈ కంపెనీల ద్వారా చాలా మందికి ఉపాధి లభించింది. అయితే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో కూరుకుపోవడంతో టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించడం ప్రారంభించాయి.

వ్యయాలను తగ్గించే ప్రయత్నంలో స్పాటిఫై టెక్నాలజీ ఎస్ఏ ఈ వారంలోనే ఉద్యోగుల తొలగింపునకు ప్రణాళికలు రచిస్తోంది. Spotify అక్టోబర్‌లో దాని గిమ్లెట్ మీడియా, పార్కాస్ట్ పోడ్‌కాస్ట్ స్టూడియోల నుండి 38 మందిని, అలాగే సెప్టెంబర్‌లో పోడ్‌కాస్ట్ ఎడిటోరియల్ ఉద్యోగులను తొలగించింది. మ్యూజిక్ స్ట్రీమింగ్ దిగ్గజం దాని మూడవ త్రైమాసిక ఆదాయ నివేదిక ప్రకారం దాదాపు 9,800 మంది ఉద్యోగులను కలిగి ఉంది. 

రాబోయే ఉద్యోగుల కోతలపై వ్యాఖ్యానించడానికి స్పాటిఫై ప్రతినిధి నిరాకరించినట్టు హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది. 2019 నుంచి పాడ్కాస్టింగ్ కు కంపెనీ భారీ హామీ ఇచ్చింది. పాడ్కాస్ట్ నెట్వర్క్లు, సాఫ్ట్ వేర్ తయారీ, హోస్టింగ్ సర్వీస్, ది జో రోగన్ ఎక్స్పీరియన్స్-ఆర్మ్చైర్ ఎక్స్పర్ట్ వంటి ప్రజాదరణ పొందిన షోల హక్కులను కొనుగోలు చేయడానికి ఇది ఒక బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అయినప్పటికీ ఈ పెట్టుబడులు ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షించాయి. రాబడులు ఎప్పుడు వస్తాయని ఇన్వెస్టర్లు ప్రశ్నించడంతో గత ఏడాది షేర్లు 66 శాతం పతనమయ్యాయి. వచ్చే ఒకటి, రెండేళ్లలో తమ పాడ్కాస్ట్ వ్యాపారం లాభదాయకంగా మారుతుందని స్పాటిఫై ఎగ్జిక్యూటివ్ ఒకరు జూన్ లో తెలిపారు.

కాగా, తాజాగా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అలాగే, అమెజాన్ వివిధ దశల్లో దాదాపు 2,300 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలు ప్రకటించింది. అదేవిధంగా, మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా పరిగణించబడుతుంది. గత జూన్ నాటి డేటా ప్రకారం, వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 21 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మంది అంటే 11 వేల మందిని ఏకంగా తొలగించబోతున్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో మైక్రోసాఫ్ట్ దాదాపు 1,000 మందిని తొలగించినట్లు సమాచారం. ప్రపంచ ఆర్థిక మందగమనం కారణంగా, ట్విట్టర్, మెటా వంటి అనేక కంపెనీలు ఇప్పటికే లేఆఫ్‌లు ప్రకటించాయి. సిస్కో 4000 మంది ఉద్యోగులను తొలగించింది. అదేవిధంగా ఓయో కూడా 600 మందిని తొలగించింది.

Follow Us:
Download App:
  • android
  • ios