కర్ణాటకలో ఈసారి బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ పని చేయదు.. కాంగ్రెస్ దే అధికారం - మాజీ మంత్రి ఎంబీ పాటిల్

కర్ణాటకలో ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోెకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎంబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం బీజేపీ ‘ఆపరేషన్ లోటస్‘ చేపట్టినా అది పని చేయదని అన్నారు. 

This time BJP's 'Operation Lotus' will not work in Karnataka.. Congress is in power - Former minister MB Patil..ISR

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 130 సీట్లతో కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంబీ పాటిల్ అన్నారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేలను వేటాడేందుకు బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ లోటస్’ ఈ సారి విజయవంతం కాదని ఆయన అన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న ఎంబీ పాటిల్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో శనివారం మాట్లాడారు. తమ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని తేల్చి చెప్పారు.

పోలీసులు వెంబడిస్తున్నారని భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి.. ఎక్కడ జరిగిందంటే ?

బీజేపీకి చెందిన లింగాయత్ అగ్రనేతలు జగదీశ్ శెట్టర్, లక్ష్మణ్ సవది కాంగ్రెస్ లో చేరిన తర్వాత తనను పక్కన పాటిల్ అన్నారు. పార్టీలో తన ప్రాముఖ్యతను కోల్పోలేదని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల అనంతరం ఆపరేషన్ లోటస్ నిర్వహిస్తే.. అది విజయవంతం కాదని అన్నారు. బీజేపీ, జేడీఎస్ కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యాబలం ఉండదని అన్నారు. జేడీఎస్ మద్దతు తీసుకుంటే కాంగ్రెస్ కు 130కి పైగా సీట్లు వస్తాయని చెప్పారు.

‘‘కర్ణాటకలో గతంలో బీజేపీ మెజారిటీ లేకుండా అధికారంలోకి వచ్చింది. 2018లో బీజేపీ తన సీఎం అభ్యర్థిగా లింగాయత్ నేత బీఎస్ యడ్యూరప్పను ప్రొజెక్ట్ చేసింది. కానీ ఆ సమయంలో కాషాయ పార్టీ 115 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. కేవలం 105 సీట్లు మాత్రమే సాధించింది. ఈ సారి జేపీ సొంతంగా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు.’’ అని ఆయన అన్నారు. గతంలో ఆపరేషన్ లోటస్ నిర్వహించి బీజేపీ 17 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల చొప్పున, మొత్తంగా రూ. 1700 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు.

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ సూసైడ్.. ఇదే నా చివరి వీడియో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అంతకు ముందే పోస్ట్

ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న విభేదాలపై పాటిల్ స్పందిస్తూ..‘‘అలాంటిదేమీ లేదు. ప్రతి ఒక్కరికీ ఆకాంక్షలు ఉంటాయి. అందులో తప్పేమీ లేదు. బీజేపీ నేతలకు ఆకాంక్షలు లేవా ? సిద్ధరామయ్య, డీకే శివకుమార్, మల్లిఖార్జున ఖర్గేలతో పాటు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి కోసం సమర్థులైన నాయకులు, పోటీదారులు చాలా మంది ఉన్నారు. అయితే దానిపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుంది.’’ అని చెప్పారు. 

తాను కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీదారునేనని పాటిల్ స్పష్టం చేశారు. జి.పరమేశ్వర, కృష్ణ బైరెగౌడ, రామలింగారెడ్డి, హెచ్.కె.పాటిల్, ఆర్.వి.లకు కూడా సీఎం అయ్యే సత్తా ఉందని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ లెజిస్లేచర్ కమిటీ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 

పాకిస్థాన్ లో తెరపైకి వింత ఘటన.. తమ కూతుర్లపై లైంగిక దాడి జరగకూడదని సమాధులకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..

రాష్ట్రంలోని ప్రముఖ లింగాయత్ నేత అయిన పాటిల్ 1991లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తికోట నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. తరువాత లోక్ సభ ఎన్నికల్లో బీజాపూర్ (ఇప్పుడు విజయపురగా పేరు మార్చబడింది) నుండి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2008లో మళ్లీ బాబలేశ్వర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పటి నుంచి అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పాటిల్.. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios