Asianet News TeluguAsianet News Telugu

పోలీసులు వెంబడిస్తున్నారని భవనంపై నుంచి దూకి వ్యక్తి మృతి.. ఎక్కడ జరిగిందంటే ?

పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఓ నిందితుడు భవనంపై నుంచి దూకి చనిపోయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. అతడు పలువురితో కలిసి నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ముఠాపై పోలీసులు దాడి చేసిన సమయంలో ఇది చోటు చేసుకుంది. 

A man died after jumping from a building saying that he was being chased by the police.. Where did it happen?..ISR
Author
First Published Apr 30, 2023, 11:16 AM IST

పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఓ వ్యక్తి భవనంపై నుంచి దూకి మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది. భివండి ప్రాంతంలో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), థానే పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఇది జరిగింది. 

మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తపై కిరోసిన పోసి నిప్పంటించిన భార్య.. యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు

వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ల బెడద ఎక్కువయ్యింది. దీనిని నివారించడానికి మహారాష్ట్ర రాష్ట్ర పోలీసులు, ఏటీఎస్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది జూలైలో మొరాదాబాద్ పోలీసులు అక్రమ అంతర్జాతీయ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ను ఛేదించి నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే తాజాగా థానే జిల్లాలోని భివాండి ప్రాంతంలోని గౌరీ పాదలోని ఓ భవనంలోని ఐదో అంతస్తులో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఉందని సమాచారం వారికి అందించింది. దీంతో శనివారం సాయంత్రం పోలీసులు, ఏటీఎస్ అధికారులు అక్కడికి చేరుకొని దాడి చేశారు. 

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ సూసైడ్.. ఇదే నా చివరి వీడియో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అంతకు ముందే పోస్ట్

అయితే నిందితుల్లో ఒకరు పోలీసులకు చిక్కుకుండా ఉండేందుకు పరిగెత్తి భవనం పైనుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర గాయాలతో అతడు మరణించాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపించారు. అయితే వారికి ఆశ్రయం ఇచ్చిన ఫ్లాట్ యజమాని కోసం గాలిస్తున్నామని, అక్కడ లభించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నామని థానే పోలీసులు తెలిపారు. 

కాగా.. గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు ఈ నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్ ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చేవారని మొరాదాబాద్ ఎస్పీ అఖిలేష్ భదౌరియా తెలిపారు. వీరు సిమ్ బాక్సుల ద్వారా వీవోఐపీ కాల్స్ ను జీఎస్ ఎం కాల్స్ గా మార్చేవారని చెప్పారు. నిందితులను  మహ్మద్ కలీం, అతని సోదరుడు మహ్మద్ మెహరాజ్ గా గుర్తించామని చెప్పారు. వారి నుంచి 550 సిమ్ కార్డులు, రూ.63 వేలు స్వాధీనం చేసుకున్నారు.

బ్యూటీపార్లర్‌కు వెళ్లొద్దన్న భర్త.. కోపంతో ఆ భార్య ఎంత పని చేసిందంటే ?

వీరిద్దరూ సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయుల కోసం వారు ఈ పని చేసేవారు. అక్కడి నుంచి వచ్చే కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి ప్రభుత్వాన్ని మోసం చేసేవారు. సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ను నిర్వహిస్తూ నిందితులకు డబ్బు పంపించేవాడని ఎస్పీ తెలిపారు. అయితే ఇందులో ఓ నిందితుడు మహ్మద్ కలీమ్ 2022 మార్చిలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్ గా మార్చి డబ్బులు ఎలా సంపాదించాలో అతడికి నేర్పించాడు. ఈ విషయాన్ని నిందితుడే అంగీకరించాడు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios