ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ సూసైడ్.. ఇదే నా చివరి వీడియో అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అంతకు ముందే పోస్ట్
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్న ముస్కాన్ నారంగ్ ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో పలు విషయాలను ఆమె ప్రస్తావించారు. ఇదే తన లాస్ట్ వీడియో అని చెప్పారు.
యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఠాణా సివిల్ లైన్స్‌లోని రామగంగా విహార్ కాలనీలో నివాసం ఉండే 25 ఏళ్ల ముస్కాన్ ముంబైలో ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. హోలీ సందర్భంగా ముంబై నుంచి తన ఇంటికి వచ్చి ఉంటోంది. ఎప్పటిలాగే గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులతో భోజనం చేసింది. అనంతరం తన గదికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం కుటుంబ సభ్యులు వెళ్లి తలుపు తెరిచి చూడగా.. ఆమె విగతజీవిగా కనిపించారు.
బ్యూటీపార్లర్‌కు వెళ్లొద్దన్న భర్త.. కోపంతో ఆ భార్య ఎంత పని చేసిందంటే ?
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం హాస్పిటల్ కు తరలించారు. కాగా.. ముస్కాన్ ముంబై నుండి ఇంటికి వచ్చినప్పటి నుండి కలతగా ఉంటోందని ఆమె తండ్రి చంద్ర ప్రకాష్ నారంగ్ మీడియాతో తెలిపారు. తాము అంతా కలిసి డిన్నర్ చేశామని, తరువాత కూతురు తన గదిలోకి వెళ్లి పడుకుందని చెప్పారు. శుక్రవారం ఉదయం గది నుంచి బయటకు రాకపోవడంతో గదికి వెళ్లి పిలిచామని తెలిపారు. అటు నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీ తెరిచి లోపలకి చూశామని చెప్పారు. లోపల ముస్కాన్ నారంగ్ ఆత్మహత్య చేసుకొని కనిపించారని తెలిపారు.
కాగా.. ముస్కాన్ నారంగ్ ఆత్మహ్యతకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఆమె ఇదే తన లాస్ట్ వీడియో అని తెలిపారు. తన కుటుంబ సభ్యులను, స్నేహితులను కన్విన్స్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశానని నారంగ్ పేర్కొన్నారు. కానీ అందరూ తిరిగి తననే ఒప్పించేందుకు ప్రయత్నించారని చెప్పారు. నేను చేసే పనిలో ఎవరి ప్రమేయమూ లేదని ఆమె అన్నారు. ఈ విషయంలో ఎవరనీ నిందించకూడదని తెలిపారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భేటీ.. ‘‘కలవడానికెందుకురా తొందరా ’’ అంటూ మంత్రి అంబటి సెటైర్లు
ఇదిలా ఉండగా.. ముస్కాన్ నారంగ్ తండ్రి చంద్రప్రకాష్ నారంగ్ ఒక పెద్ద వ్యాపారవేత్త. డిస్పోజబుల్ క్రాకరీ బిజినెస్ చేస్తుంటారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆత్మహత్యకు పాల్పడిన ముస్కాన్ అందరిలో పెద్దది. ఆమె ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. ఆ తర్వాత ముంబైలోని ఓ కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేయడం మొదలుపెట్టారు.
చెన్నై విమానాశ్రయంలో బిగ్ షాక్: మహిళ లగేజీలో పాముల కుప్ప
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.