కేరళలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకుడి కాన్వాయ్ నే అడ్డుకున్నారు. అయితే వారంతా కాన్వాయ్ మంత్రిదని భావించారు. తరువాత ఆయన కారుకు దారి ఇచ్చారు. 

ఓ పార్టీ నాయకుడిని అదే పార్టీకి చెందిన నాయకులు అడ్డుకోవడం ఎప్పుడైనా చూశారా ? ఆయన కారును ఆపేందుకు రోడ్డును దిగ్బంధించడం ఎప్పుడైనా విన్నారా ? లేదు కదూ.. కానీ కేరళలో అలాంటి విచిత్ర ఘటన ఒకటి జరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ నాయకుడినే అడ్డుకున్నారు. అయితే వారిక్కడ కావాలని అలా చేయలేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి కారును.. వారు మంత్రి కారుగా భావించారు.

బామ్మా.. నువ్వు గ్రేట్.. మనువరాళ్లను కాపాడేందుకు చిరుతపులితోనే వీరోచితంగా పోరాడిన వృద్ధురాలు..

ఈ విచిత్ర ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలో హైప్రొఫైల్ చీటింగ్ కేసులో కేపీసీసీ అధ్యక్షుడు కే సుధాకరన్ ను క్రైమ్ బ్రాంచ్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ నాయకుడిని కావాలనే అధికార ఎల్ డీఎఫ్ ప్రభుత్వం ఇరికించిందని ఆరోపిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

అందులో భాగంగా అలప్పుజ జిల్లాలోని హరిపాడ్ లో శుక్రవారం రాత్రి ఇలాంటి నిరసన సభ జరుగుతోంది. ఈ సమయంలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆ ప్రాంతం గుండా వెళ్లారు. అయితే జాతీయ రహదారిని దిగ్బంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు కాన్వాయ్ వెళ్తుండటాన్ని చూసి ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు. ఆ కాన్వాయ్ కు ముందు పోలీసు ఎస్కార్ట్ ఉండటం, జాతీయ జెండాతో కూడిన తెల్లని కారు ప్రయాణిస్తుండటాన్ని చూసి ఎల్డీఎఫ్ క్యాబినెట్ లోని కొందరు మంత్రులు వెళ్తున్నారని వారు భావించారు. 

రాహుల్ గాంధీ పెళ్లి ప్రతిపాదనకు ఆమోదం లభించింది -విపక్షాల పాట్నా సమావేశంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సెటైర్

దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమయాన్ని వృథా చేయకుండా కాన్వాయ్ ను ఆపేందుకు దూసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తెల్ల కారు ముందు దూకారు. అయితే అందులో ఉన్న కాంగ్రెస్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ కిటీకి గ్లాస్ లను కిందకి దించారు. అనంతరం వాహనంలోని లైట్లను ఆన్ చేయడంతో అక్కడున్న కార్యకర్తలు నోరెళ్లబెట్టారు. అందులో ఉన్నది తమ పార్టీ నాయకుడే అని గ్రహించి ఒక్క సారిగా ఖంగుతిన్నారు. 

ఘోరం.. 11 నెలల చిన్నారిపై బాలుడు అత్యాచారం.. రక్తపు మడుగులో వదిలేసి పారిపోయిన మైనర్..

తరువాత అక్కడి కార్యకర్తలంతా సైలెంట్ అయిపోయారు. కొంత సమయంలోనే వీడీ సతీశన్ కాన్వాయ్ కు దారి ఇచ్చారు. అయితే ఆయన వాహన శ్రేణి బయలుదేరే ముందు ఆ నిరసనకు మద్దతు తెలిపారని కేరళ మీడియా తెలిపింది.