నాలుగేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు మనువరాళ్లను కాపాడేందుకు ఓ బామ్మ తన తెగువను ప్రదర్శించింది.క్రూర జంతువు అయిన చిరుత పులితోనే పోరాడింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో వెలుగులోకి వచ్చింది. 

ఇద్దరు మనువరాళ్లను కాపాడేందుకు ఓ బామ్మ ఏకంగా చిరుతపులితోనే వీరోచితంగా పోరాడింది. ఈ పోరాటంలో ఆమె విజయం సాధించింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని తెహ్రీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్కి గ్రామంలో 57 ఏళ్ల చంద్రమ దేవి తన కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే గత బుధవారం రాత్రి ఆమె తన మనవరాళ్లతో కలిసి ఇంటి వరండాలో నిద్రపోతోంది. ఈ సమయంలో సమీపంలోని అడవి నుంచి ఓ చిరుత పులి అక్కడికి చేరుకుంది.

రాహుల్ గాంధీ పెళ్లి ప్రతిపాదనకు ఆమోదం లభించింది -విపక్షాల పాట్నా సమావేశంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సెటైర్

దాదాపు నాలుగేళ్ల వయస్సు ఉన్న ఇద్దరు బాలికలపై ఆ పులి దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ అలజడికి చంద్రమ దేవికి మెలుకువ వచ్చింది. అక్కడ జరుగుతున్న పరిణామాన్ని చూసి వెంటనే నిద్ర మత్తులో నుంచి తేరుకొని అలెర్ట్ అయ్యింది. తన మనవరాళ్లను కాపాడేందుకు చిరుతపులిపైనే దాడి చేసింది. ఆ క్రూర మృగంతో వీరోచితంగా పోరాడింది. 

మహిళా ట్యూషన్ టీచర్ తో పారిపోయిన విద్యార్థిని.. మేజర్ అయిన తరువాత కలిసి జీవిస్తామంటూ పోలీసులతోనే..

ఈ క్రమంలో ఆ చిరుత దేవిపై కూడా దాడి చేసింది. ఆమెను ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించింది. వృద్ధురాలు అరుపులు మొదలుపెట్టడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు మెలుకువ వచ్చింది. వెంటనే అక్కడి వచ్చి పరిస్థితి అర్థం చేరుకున్నారు. వారంతా కలిసి ఆ చిరుతను భయపెట్టడం మొదలుపెట్టారు. అక్కడంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో చిరుత పారిపోయిందని ‘ఇండియా టీవీ’ నివేదించింది.

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. టైరు పేలడంతో చెట్టును ఢీ కొట్టిన వాహనం.. ఉడిపిలో ఘటన

అయితే చిరుత దాడిలో దేవికి గాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ తొలుత ఆమెకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్లోని హిమాలయన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రమ దేవి హిమాలయన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పేర్కొంది. ఆమె ముఖంపై కొన్ని గాయాలున్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కానీ ఆ గాయాలు ప్రాణాంతకం కావని పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆమె ముఖంపై ఏడెనిమిది కుట్లు పడ్డాయి. త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.