ఘోరం.. 11 నెలల చిన్నారిపై బాలుడు అత్యాచారం.. రక్తపు మడుగులో వదిలేసి పారిపోయిన మైనర్..
11 నెలల చిన్నారిపై 12 ఏళ్ల బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారిపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాధితురాలికి రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
నేడు సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా యూపీలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. 11 నెలల చిన్నారిపై మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మహిళా ట్యూషన్ టీచర్ తో పారిపోయిన విద్యార్థిని.. మేజర్ అయిన తరువాత కలిసి జీవిస్తామంటూ పోలీసులతోనే..
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని అలీగఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో తన తల్లిదండ్రులతో కలిసి 11 నెలల చిన్నారి నివసిస్తోంది. ఈ క్రమంలో గత బుధవారం వీరి కుటుంబానికి పొరుగునే నివసించే 12 ఏళ్ల బాలుడు చిన్నారి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన ఆ బాలుడు.. ఆ చిన్నారిని మేడపైకి తీసుకెళ్లాడు.
బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొంత సమయం తరువాత అక్కడి నుంచి పారిపోయాడు. బాలిక ఏడుపు వినపడటంతో తల్లిదండ్రులు మేడపైకి చేరుకున్నారు. బాలిక రక్తపు మడుగులో ఏడుస్తూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బాలుడిపై ఐపీసీ సెక్షన్ 376-ఏబీ (12 ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు గురువారం తెల్లవారుజామున బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపర్చారు. అక్కడి నుంచి ఆగ్రాలోని చైల్డ్ రిఫార్మ్ హోమ్ కు తరలించారు.