పాట్నాలో విపక్షాలు నిర్వహించిన సమావేశంలో రాహుల్ గాంధీ పెళ్లిక ఆమోదం లభించిందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సెటైర్లు వేశారు. మూడో సారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

బీహార్ లోని పాట్నాలో శుక్రవారం జరిగిన విపక్షాల సమావేశంలో నేతలు ఆమోదించిన కీలక తీర్మానం రాహుల్ గాంధీ పెళ్లి గురించేనని కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశం డ్రామాగా అభివర్ణించిన ఠాకూర్.. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్.. ఆరిజన్ నిర్వాహకురాలు శేజల్ తో బీఆర్ఎస్ ఎంపీల చర్చలు..

2024 ఎన్నికలకు ముందు వేదికను అలంకరిస్తున్నారని, కళాకారులు ఒక్క దగ్గరికి చేరడం ప్రారంభించారని ఆయన ఎద్దేవా చేశారు. పాత్రలను ఖరారు చేస్తున్నారని తెలిపారు. ‘‘డ్రామా ఆడుతారు. ఒకరికొకరు మద్దతిచ్చించేందుకు ప్రతిజ్ఞలు చేస్తారు. ప్రజలు బాగా నవ్వుతారు. భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు’’ అని అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

17 ప్రతిపక్ష పార్టీల సమావేశం ఫలితాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ నితీశ్ కుమార్ కన్వీనర్ గా ఆమోదయోగ్యం కారు. రాహుల్ గాంధీ పెళ్లి ప్రతిపాదన ఆమోదం పొందింది. మమ్మీకి చాలా కోపం వచ్చింది. ప్రెస్ మీట్ పెడతారు.. కానీ ప్రశ్నలకు సమాధానం చెప్పరు..’’ అని అన్నారు. వారి గుండెలు కలవడం లేదని, సీటు వస్తుందనే ఆశ కూడా లేదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

‘‘సమావేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం అనంతరం మౌనంగా వెళ్లిపోయారు. కాశ్మీర్ లో శాంతిని సహించలేమని, ఉగ్రవాద మూలాలను బలోపేతం చేయడానికి ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని కలలు కంటున్నారు. పొలిటికల్ టూరిజం కొత్త తలుపులు తెరుచుకున్నాయి. బిహార్ లో 'లిట్టి చోఖా', రసగుల్లాను ఆస్వాదించిన తర్వాత వారిప్పుడు సిమ్లాలో కలువనున్నారు’’ అని అన్నారు.

ఘోరం.. 11 నెలల చిన్నారిపై బాలుడు అత్యాచారం.. రక్తపు మడుగులో వదిలేసి పారిపోయిన మైనర్..

కాగా.. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కూటమి ఏర్పాటుకు మార్గాలను అన్వేషించడానికి 17 ప్రతిపక్ష పార్టీల నేతలు శుక్రవారం పాట్నాలో సమావేశయ్యాయి. ఈ సమావేశం సుమారు నాలుగు గంటలపాటు సాగింది. ఈ భేటీ సానుకూల ఫలితాలను ఇచ్చిందని విపక్షాలు చెప్పాయి. తామంతా కలిసే ఉన్నామని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని తెలిపాయి. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో మరో సమావేశం నిర్వహిస్తామని, అందులో తుది నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించాయి.