రామ జన్మభూమి తీర్పును వాయిదా వేయాలని తనపై ఒత్తిడి వచ్చిందని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి సుధీర్ అగర్వాల్ వెల్లడించారు. ఒక వేళ తాము ఆ సమయంలో తీర్పు చెప్పకపోయి ఉంటే మరో 200 ఏళ్ల పాటు ఈ కేసు కోర్టులో కొనసాగుతూనే ఉండేదని తెలిపారు.
2010లో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కీలక తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ సుధీర్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తీర్పు ఇవ్వొద్దని తనపై ఒత్తిడి వచ్చిందని చెప్పారు. 2020 ఏప్రిల్ 23న హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన జస్టిస్ అగర్వాల్.. తాము 2010లో ఈ కేసులో తీర్పు ఇవ్వకపోతే ఈ కేసు మరో 200 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉండేదని అన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘తీర్పు వెలువరించిన తర్వాత.. నేను ఆశీర్వాదం పొందినట్టు భావించాను... ఈ కేసులో తీర్పును వాయిదా వేయాలని నాపై ఒత్తిడి తెచ్చారు. లోపల నుంచి, బయటి నుంచి కూడా ఒత్తిడి వచ్చింది’’ అని ఆయన అన్నారు. ‘‘ఇంటి సభ్యులు, బంధువులు ఏదో విధంగా ఈ కేసు తీర్పును ఆలస్యం చేయాలని, తొందరగా వెల్లడించొద్దని సూచించేవారు’’ అని ఆయన అన్నారు.
ఒడిశా రైలు ప్రమాదం : బాధితుల కోసం జీతంలో కొంత విరాళమివ్వండి - ఎంపీలకు వరణ్ గాంధీ సూచన
అయోధ్యలో ఉన్న 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, హిందూ మహాసభ ప్రాతినిధ్యం వహిస్తున్న 'రామ్ లల్లా' లేదా శిశు రాముడు అనే మూడు పక్షాలకు పంచాలని 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ యూ ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ డీవీ శర్మలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. హైకోర్టు 2:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
టైల్స్ వ్యాపారితో యువతి అక్రమ సంబంధం.. తండ్రి, ప్రియుడు, మరొకరితో కలిసి ఆమె ఏం చేసిందంటే ?
అయోధ్య భూవివాదం, రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు 2019 నవంబర్ లో తీర్పును ప్రకటించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో మందిరాన్ని నిర్మించాలని, ముస్లిం పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
