కర్ణాటకలో జరిగిన టైల్స్ వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యలో నలుగురి ప్రమేయం ఉందని అభియోగిస్తూ, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు అక్రమ సంబంధం కూడా కారణమని తెలిపారు.
కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలో గత నెలలో టైల్స్ వ్యాపారి హత్య జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అందులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు ఓ అభిప్రాయానికి వచ్చారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైలు ప్రమాదాలను నివారించవచ్చా ? ఈ దేశాల నుంచి భారత్ నేర్చుకుంటే అది సాధ్యమే..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చిక్కమగళూరుకు చెందిన జాకీర్ టైల్స్ వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన కొంత కాలం కిందట తమకూరు ప్రాంతంలో టైల్స్ షాప్ ప్రారంభించాడు. అయితే అతడు గత నెల 20వ తేదీన రాత్రి సమయంలో హత్యకు గురయ్యాడు. ఆ వ్యాపారిని పలువురు అతి కిరాతకంగా వేట కొడవళ్లతో హతమార్చారు. ఇది ఆ సమయంలో స్థానికంగా కలకరం రేకెత్తించింది.
అమెరికాలో నిజామాబాద్ యువకుడు మృతి.. ఎలాగంటే ?
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితుల్లో కుబ్రాన్, రబాని, వికాస్, మరో యువతి ఉన్నారు. వీరందరూ కూడా జాకీర్ స్వస్థలమైన చిక్కమగళూరు ప్రాంతానికి చెందినవారే. ఈ నిందితుల్లో కుబ్రాన్ - రబానీ తండ్రీ కూతుర్లు. కాగా.. గతంలో నుంచే జాకీర్ కు, రబానీకి అక్రమ సంబంధం ఉంది. ఈ విషయంలో కుబ్రాన్, జాకీర్ కు పలు మార్లు గొడవ జరిగింది.
అయితే జాకీర్ టైల్స్ వ్యాపారం చేసేందుకు తుమకూరులో షాప్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో కుబ్రాన్, అతడి కూతురు రబానీ, ఆమె ప్రియుడు వికాస్, మరో యువతి వచ్చి అతడిని జాకీర్ ను దారుణంగా హతమార్చారని పోలీసులు తెలిపారు. కాగా.. నిందితులు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
