అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ డిమాండ్ చేశారు. గతంలో ప్రమాదం జరిగినప్పుడు లాల్ బహుదూర్ శాస్త్రి తన పదవిని వదలాల్సిందే అని అన్నారు. 

ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలనే డిమాండ్ లు పెరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులతో పాటు పలు వర్గాల నుంచి కూడా ఈ డిమాండ్ వస్తుంది. తాజాగా ఎన్ సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా ఇదే జాబితాలోకి చేరారు. అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

ఒడిశా రైలు ప్రమాదం : బాధితుల కోసం జీతంలో కొంత విరాళమివ్వండి - ఎంపీలకు వరణ్ గాంధీ సూచన

ఈ మేరకు శరద్ పవార్ మీడియాతో మాట్లాడుతూ గతంలో జరిగిన రైలు ప్రమాద ఘటనను, ఆ సమయంలో కేంద్ర రైల్వే మంత్రి ప్రవర్తన తీరును ఆయన గుర్తుచేశారు. ‘‘లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రమాదం జరిగింది. దీంతో ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ నిర్ణయాన్ని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ శాస్త్రి మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇది తన నైతిక బాధ్యత అంటూ రాజీనామా చేశారు. ఇప్పుడు అదే పరిస్థితిని దేశం కూడా ఎదుర్కొంటోంది. రాజకీయ నాయకులు సాధ్యమైనంత చర్యలు తీసుకోవాలి’’ అని శరద్ పవార్ అన్నారు.

టైల్స్ వ్యాపారితో యువతి అక్రమ సంబంధం.. తండ్రి, ప్రియుడు, మరొకరితో కలిసి ఆమె ఏం చేసిందంటే ?

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, 1,100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల్లో భారత్ లో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొనడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. కాగా.. శనివారం మధ్యాహ్నం రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగడంతో 150కి పైగా రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించగా.. మరి కొన్నింటిని కొంత సమయం నిలిపివేశారు.

రైలు ఎక్కిన నా కుమారుడెక్కడా ? కొడుకు కోసం గాలిస్తూ, మృతదేహాలను పరిశీలిస్తూ ఏడ్చిన తండ్రి.. వీడియో వైరల్

ఇదిలా ఉండగా.. కటక్ లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రైలు ప్రమాదంపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం ప్రకటించారు.