Asianet News TeluguAsianet News Telugu

దేశం చెక్కు చెద‌ర‌కూడ‌దంటే పీఎఫ్‌ఐపై నిషేధం ఉండాల్సిందే- బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్

దేశం ఐకమత్యంగా ఉండాలంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేదించాల్సిందేనని జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. రాజస్థాన్ అల్లర్లలో ఆ సంస్థకు ప్రమేయం ఉందని ఆరోపించారు. 

There should be a ban on PFI if the country is not to cash a cheque- BJP General Secretary Arun Singh
Author
First Published Sep 28, 2022, 12:43 PM IST

దేశాన్ని చెక్కుచెదరకుండా ఉంచాలంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)పై నిషేధం ఉండాల్సిందే అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ‘‘రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో అల్లర్లు జరిగినప్పుడు పీఎఫ్‌ఐ ప్రమేయం ఉందని మేం చెప్పాం. ఇక్కడ కూడా (కర్ణాటకలో) సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు 23 మందికి పైగా చనిపోయారు. దేశాన్ని అలాగే ఉంచేందుకు (పీఎఫ్‌ఐ) నిషేధం తప్పనిసరి’’ అని ఆయ‌న తెలిపారు.

ఢిల్లీలో దారుణం.. వైద్యురాలిపై జైలులోనే ఖైదీ అత్యాచారం, హత్యాయత్నం..

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) మంగళవారం రాత్రి పీఎఫ్ఐని నిషేదిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ‘‘ పీఎఫ్ఐ, దాని సహచర, అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్‌లను తక్షణమే చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటిస్తున్నాం. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల కింద వాటిని ఐదేళ్ల పాటు నిషేదిస్తున్నాం ’’ అని నోటిఫికేషన్ పేర్కొంది.

దొంగబాబాల మాట నమ్మి.. సజీవసమాధిలోకి వెళ్లిన యువకుడు.. పోలీసులు రావడంతో..

‘‘ పీఎఫ్ఐ, దాని అసోసియేట్‌లు, అనుబంధ సంస్థలు, ఫ్రంట్‌లు బహిరంగంగా సామాజిక-ఆర్థిక, విద్యా, రాజకీయ సంస్థగా పనిచేస్తాయి. అయితే అందులో పని చేసేవారు ప్రజాస్వామ్య భావనను అణగదొక్కడానికి, అగౌరవపరిచే దిశగా పనిచేస్తున్నారు. సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని సమూలంగా మార్చడానికి రహస్య ఎజెండాను అనుసరిస్తున్నారు. ’’ అని తెలిపింది. PFI, దాని సహచరులు, అనుబంధ సంస్థలు, ఫ్రంట్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, ఇవి దేశ సమగ్రత, సార్వభౌమత్వం, భద్రతకు విఘాతం కలిగిస్తాయని, దేశంలోని ప్రజా శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉందని పేర్కొంది.

బతుకమ్మతో ఇందిరాగాంధీ.... రేర్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక గాంధీ...!

పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యులలో కొందరు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) నాయకులు, జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB)తో సంబంధాలు కలిగి ఉన్నారని, ఈ రెండూ నిషేధిత సంస్థలు అని తెలిపింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా (ISIS) వంటి గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో పీఎఫ్ఐ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అనేక సందర్భాలు ఉన్నాయని పేర్కొంది. 

కాగా.. జాతీయ దర్యాప్తు సంస్థ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, రాష్ట్ర పోలీసు బలగాలు సంయుక్తంగా రెండు విడతల్లో దేశంలోని PFI నాయకులు, సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. దాదాపు 15 రాష్ట్రాల్లోని 93 ప్రదేశాలలో సోదాలు చేపట్టాయి. ఇందులో 100 మంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) కార్యకర్తలను అరెస్టు చేశారు. దాడులు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, మణిపూర్ ఉన్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థల దూకుడు.. సమీర్ మహేంద్రును అరెస్ట్ చేసిన ఈడీ

ఇదిలా ఉండ‌గా.. అనేక హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు పీఎఫ్ఐ, దాని నాయకులు, సభ్యులపై గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios