ఈ శుభాకాంక్షలు తెలిపే క్రమంలో ఆమె ఇందిరా గాంధీకి సంబంధించిన ఓ పాత ఫోటోని షేర్ చేశారు. అది ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరికీ అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా... కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే... ఈ శుభాకాంక్షలు తెలిపే క్రమంలో ఆమె ఇందిరా గాంధీకి సంబంధించిన ఓ పాత ఫోటోని షేర్ చేశారు. అది ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇందిరాగాంధీ..ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో... తెలంగాణలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోను ఇందిరా గాంధీ షేర్ చేయడం గమనార్హం. 

Scroll to load tweet…

1978లో తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా ఇందిరా గాంధీ బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా పూల‌తో అలంక‌రించిన బ‌తుక‌మ్మ‌ను త‌న చేతుల్లో ప‌ట్టుకుని ఉన్న ఇందిరా గాంధీ ఫొటోనే ప్రియాంకా గాంధీ షేర్ చేశారు. 1978లో ఓరుగల్లులో త‌న‌ నానమ్మ ఇందిరా గాంధీ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతిగా నిలిచింద‌ని ప్రియాంకా పేర్కొన్నారు. 1980లో ఇందిర మెద‌క్ పార్ల‌మెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.