Asianet News TeluguAsianet News Telugu

వామ్మో.. 63 చెంచాలు తిన్న యువకుడు.. ఆపరేష‌న్ చేసి బ‌య‌ట‌కు తీసిన డాక్ట‌ర్లు.. ఎక్క‌డంటే ?

కడుపునొప్పితో బాధపడుతూ హాస్పిటల్ లో చేరిన యువకుడికి డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో డాక్టర్లు అతడి కడుపులో నుంచి 63 చెంచాలను వెలికి తీశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. 

the young man who ate 63 spoons.. the doctors who operated and took him out.. where?
Author
First Published Sep 29, 2022, 2:40 PM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఓ విచిత్ర ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ వ్య‌క్తి క‌డుపులో నుంచి ఒకటి రెండు కాదు ఏకంగా 63 చెంచాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్చ‌ర్యాన్ని రేకెత్తించింది. క‌డుపునొప్పితో బాధ‌పడుతున్న యువ‌కుడిని హాస్పిట‌ల్ లో చేర్పించగా.. డాక్ట‌ర్లు ఆప‌రరేష‌న్ చేసి ఈ చెంచాల‌ను బ‌య‌టకు తీశారు.

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్.. సోనియాతో భేటీ అనంతరం అశోక్ గెహ్లాట్ నామినేషన్ పై స్పష్టత

వివ‌రాలు ఇలా ఉన్నాయి. మన్సూర్‌పూర్ జిల్లాలోని బొపారా గ్రామానికి చెందిన విజయ్ చౌహాన్ మ‌త్తు ప‌దార్థాల‌కు బానిస అయ్యాడు. దీంతో ఆ యువ‌కుడిని కుటుంబ స‌భ్యులు షామ్లీలోని కైరానా రోడ్‌లో ఉన్న ఓ డ్రగ్స్ డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అయితే విజయ్ ఐదు నెలల పాటు డ్రగ్స్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఉండి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే కొన్ని రోజుల త‌రువాత అత‌డు కడుపులో నొప్పి వస్తుంద‌ని బాధ‌ప‌డ్డాడు. దీంతో కుటుంబ స‌భ్యులు విజ‌య్ ను డాక్ట‌ర్ల‌కు చూపించారు. అయినా అత‌డి నొప్పి త‌గ్గ‌లేదు.

ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్.. 12వ సారి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌

దీంతో ఆ యువ‌కుడిని భోపా రోడ్డులోని ఇవాన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్క‌డ ఎక్స్ రే, ఇత‌ర ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డాక్ట‌ర్లు క‌డుపులో ఏదో లోహం ఉంద‌ని గ్ర‌హించారు. ఆప‌రేష‌న్ చేసి దానిని బ‌య‌ట‌కు తీయాల‌ని కుటుంబ స‌భ్యుల‌కు చెప్పారు. దానికి వారు ఒప్పుకోవ‌డంతో ఆప‌రేష‌న్ చేశారు. దీంతో డాక్ట‌ర్లు కూడా షాక్ అయ్యారు. క‌డుపులో నుంచి ఏకంగా 63 చెంచాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. 

ఈ ఘ‌ట‌న‌పై ప‌లు మీడియా సంస్థ‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల ప్ర‌కారం.. డ్రగ్స్ డీ-అడిక్షన్ సెంటర్‌లో త‌న‌కు అక్క‌డి సిబ్బంది బ‌ల‌వంతంగా స్పూన్లు తినిపించేవార‌ని విజ‌య్ కుటుంబ స‌భ్యుల‌తో వాపోయాడు. కానీ దీనిని వారు మొదట న‌మ్మ‌లేదు. కానీ ఇవాన్ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లి ఆప‌రేష‌న్ చేస్తే 63 చెంచాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.

ఘోరం.. ఇద్ద‌రు మైనర్ కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. అరెస్టు చేసిన పోలీసులు

కాగా.. ఆ డ్రగ్‌ డీ అడిక్షన్‌ సెంటర్‌పై విచార‌ణ జ‌రిపించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎంవో మహావీర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయం ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించినదని, దీనిపై మరిన్ని వివ‌రాలు సేక‌రిస్తున్నామ‌ని  పేర్కొన్నారు. అయితే ఈ వ్య‌వ‌హారంపై ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు అంద‌లేదు. రోగి ఈ చెంచాలను ఎప్పుడు తీసుకున్నాడో క‌చ్చితంగా చెప్పలేమని వైద్యులు తెలిపారు. బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, ఐసీయూలో చికిత్స పొందుతున్నాడ‌ని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios