Asianet News TeluguAsianet News Telugu

ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్.. 12వ సారి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌

ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడిగా లాలూ ప్రసాద్ యాదవ్ మరో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి లాలూ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయనే పార్టీ జాతీయ అధ్యక్షుడు అని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 

Lalu Prasad Yadav as National President of RJD.. Unanimously elected for the 12th time
Author
First Published Sep 29, 2022, 1:37 PM IST

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ త‌న పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా 12వ సారి ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆయ‌న పార్టీ కార్యాల‌యంలో నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేశారు. అయితే జాతీయ అధ్య‌క్ష ప‌దవికి ఒక్క‌టే నామినేష‌న్ దాఖ‌లు కావ‌డంతో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యార‌ని ఆర్జేడీ ఎన్నిక‌ల రిటర్నింగ్ అధికారి ఉదయ్ నారాయణ్ చౌదరి ప్ర‌క‌టించారు.

వెనక్కి చూడకుండా కార్ డోర్ ఓపెన్ చేసిన డ్రైవర్.. తప్పించబోయిన బైకర్‌ను ఢీకొన్న లారీ (వీడియో)

‘‘సెప్టెంబర్ 28వ తేదీన రాష్ట్రీయ జనతాదళ్ (RJD) జాతీయ అధ్యక్ష పదవికి లాలూ ప్రసాద్ మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేష‌న్ పత్రాలు అన్ని చెల్లుబాటు అయ్యేవ‌ని గుర్తించాం ’’ అని నారాయణ్ చౌదరి పేర్కొన్నారు. అయితే లాలూ యాదవ్ కు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన‌ప్ప‌టికీ అక్టోబ‌ర్ 10వ తేదీన తల్కటోరా స్టేడియంలో జరిగే సమావేశంలో ఆయ‌న‌కు ధృవ‌ప‌త్రం అందుతుంది. 

లాలూకు ధైర్యం ఉంటే బీహార్ లో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి - కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

లాలూ ప్రసాద్ యాదవ్ జనతాదళ్ నుండి విడిపోయి 1997 జూలై 5వ తేదీన న్యూఢిల్లీలో రాష్ట్రీయ జనతాదళ్ పార్టీని స్థాపించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న పార్టీ అధ్య‌క్ష ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు. 25 ఏళ్ల కాలంలో లాలూ యాదవ్ 12 సార్లు అప్రతిహతంగా పార్టీ అధినేత అయ్యారు.

ఛీ.. వీడు మనిషేనా.. భార్యతో గొడవపడి.. యేడాది వయసున్న కూతుర్ని వ్యవసాయ బావిలోకి విసిరేసిన తండ్రి..

ఆర్జేడీ ఆవిర్భావం త‌రువాత దాణా కుంభకోణం ఆరోపణతో 20 రోజుల్లోనే లాలూ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. దీంతో ఆయ‌న భార్య రబ్రీ దేవికి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. కాగా.. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్, బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఈ ఏడాది ఆగస్టు 9న బీహార్‌లోని ఆర్జేడీతో పాటు విపక్షాల మిత్రపక్షాల్లో మళ్లీ చేరారు. దీంతో బీహార్ రాజకీయాలు మళ్లీ ఆసక్తికరమైన మలుపు తిరిగాయి.

Follow Us:
Download App:
  • android
  • ios