Asianet News TeluguAsianet News Telugu

కుమారుడితో కలిసి భర్తను చంపిన భార్య..శవాన్ని ముక్కలుగా నరికి, వీధుల్లో పారేస్తూ కెమెరాకు చిక్కిన తల్లీకొడుకులు

ఓ తల్లి తన కుమారుడితో కలిసి తన రెండో భర్తను దారుణంగా హత్య చేసింది. అనంతరం వారిద్దరూ కలిసి శవాన్ని 10 ముక్కలుగా నరికారు. వాటిని పలు ప్రాంతాల్లో విసిరేసింది. ఈ ఘటన ఢిల్లీలో జూన్ లో జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 

The wife who killed her husband along with her son..The mother and son were caught on camera cutting the body into pieces and throwing it in the streets.
Author
First Published Nov 30, 2022, 11:44 AM IST

శ్రద్ధా వాకర్ హత్యను ఇంకా ఎవరూ మరిచిపోకముందే దేశంలో అలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్ లో ఇలాంటి దారుణాలు ఇటీవల వెలుగు చూశాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కుమారుడితో కలిసి భర్తను ఓ మహిళ దారుణంగా హత్య చేసింది. అతడిని శరీరాన్ని ముక్కలుగా చేసి పలు చోట్ల విసిరేశారు. పోలీసుల విచారణలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి.

ఎన్‌డీటీవీ బోర్డు నుంచి వైదొలిగిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్..

వివరాలు ఇలా ఉన్నాయి. పూనమ్ అనే మహిళ కుమారుడితో కలిసి తన రెండో భర్తను జూన్ లో హత్య చేసింది. అతడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి రిఫ్రిజిలేటర్ లో భద్రపరిచారు. అనంతరం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దీపక్ అవశేషాలను పారవేసారు. వారి కదలికలు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తాజాగా ఈ హత్య కేసుకు సంబంధించి కొత్త సీసీటీవీ ఫుటేజీ తెరపైకి వచ్చింది. మృతుడు అంజన్ దాస్ శరీర భాగాలు, తలను ఓ గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. కుమారుడు గొయ్యి తవ్వుతుండగా, తల్లి భర్త తల పట్టుకుని నిల్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

శ్రద్ధా హత్య కేసు తరహాలో ఈ ఘటనలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను హతమార్చింది. భర్త మృత దేహాన్ని 10 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా రోజులుగా విసురుతూనే ఉంది. సోమవారం ఈ ఘటనకు సంబంధించిన 2 సీసీటీవీ ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో కొడుకు మృతదేహం ముక్కలను బ్యాగులో పెట్టుకుని వెళ్లగా తల్లి కూడా అతడి వెంటే వెళ్లడం కనిపించింది. మంగళవారం మరో సీసీటీవీ పుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో కుమారుడు తండ్రి మృతదేహాన్ని విసిరివేస్తున్నట్లు కనిపించింది. అయితే ఈ కేసులో తలతో పాటు మరో 6 శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

పోర్న్ వీడియోలకు బానిసై పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన మైనర్.. అరెస్ట్...

కాగా.. శ్రద్ధా వాకర్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు పొరపాటున ముందుగా పూనమ్, దీపక్ ఇద్దరినీ అరెస్టు చేశారు. వీరిద్దరూ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శరీర భాగాలు విసిరేస్తున్నట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు. దీంతో ఆమెను వీరే హత్య చేసి ఉంటారని అనుమానించారు. అయితే వారు పారేసిన శరీర భాగాలు పురుషుడివని గుర్తించారు. అనంతరం ఈ కేసును ప్రత్యేకంగా విచారించడం ప్రారంభించారు. ఈ విచారణలో పాండవ్ నగర్‌కు చెందిన అంజన్ దాస్ నెలరోజులుగా కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అతడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

పార్లమెంట్‌లోనే ప్రధాని మోదీ నన్ను శూర్పణఖతో పోల్చారు.. ఖర్గే వ్యాఖ్యలపై దుమారం వేళ రేణుకా చౌదరి ట్వీట్..

దీంతో నిందితులు జూన్‌లో తామే అంజన్ దాస్ ను హత్య చేసినట్లు పూనమ్, దీపక్ ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అతడికి పానీయం అందజేసి, అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక హత్య చేశారని చెప్పారు. రక్తస్రావం జరిగిన తరువాత, ఆపై అతడి శరీరాన్ని 10 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేశారు. కాగా.. ఈ కేసులో పోలీసులు తల్లీకొడుకులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి 4 రోజుల పోలీసు రిమాండ్‌కు పంపారు. పాండవ్ నగర్ పోలీసులు వారిని విచారించనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios