Asianet News TeluguAsianet News Telugu

పోర్న్ వీడియోలకు బానిసై పదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన మైనర్.. అరెస్ట్...

గంటల తరబడి పోర్న్ చూడడానికి అలవాటు పడిన ఓ 17యేళ్ల బాలుడు.. పక్కింటి పదేళ్ల బాలిక మీద అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన ఛత్తీస్ గఢ్ లో కలకలం రేపింది. 

17years old boy addicted for watching porn, then rape and kills girl in Chhattisgarh
Author
First Published Nov 30, 2022, 10:46 AM IST

ఛత్తీస్‌ గఢ్‌ : ఛత్తీస్‌ గఢ్‌ లో దారుణ ఘటన జరిగింది. పోర్న్ చూడడానికి అలవాటు పడ్డ ఓ 17యేళ్ల కుర్రాడు.. పదేళ్ల బాలిక మీద అత్యాచారం చేసి, ఆ తరువాత గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారాలో మంగళవారం జరిగింది. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లిన తరువాత ఆ అబ్బాయి. టెర్రస్‌పై నుంచి పక్కింట్లోకి చొరబడ్డాడు. ఒంటరిగా ఉన్న పదేళ్ల బాలిక మీద అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమెను చంపేసి.. ఓ వెదురు బొంగుకు వేలాడదీశాడు. 

ఆత్మహత్యగానో, ప్రమాదవశాత్తు బొంగుకు ఉరిపడి మరణించినట్లుగానో చిత్రీకరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. చిన్నారి అంత ఎత్తులో ఉరేసుకోవడం అసాధ్యంగా కనిపించడంతో పోలీసులు అది హత్యగా అనుమానించి దర్యాప్తు మొదలుపెట్టారు. వెన్నులో ఒణుకు పుట్టించే ఈ ఘటన నవంబర్ 26న రాయ్‌పూర్‌కు 90కి.మీ దూరంలో ఉన్న గ్రామంలో జరిగింది. దర్యాప్తు తరువాత సోమవారం నాడు బాలనేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని మీద మైనర్‌పై అత్యాచారం, హత్య కేసు నమోదు చేసి, దుర్గ్ జిల్లాలోని రిమాండ్ హోమ్‌కు పంపారని పోలీసులు తెలిపారు. 

కేరళ యువతిపై బైక్ టాక్సీ డ్రైవర్ గ్యాంగ్ రేప్ కేసులో.. మహిళ సహా, ఇద్దరు నిందితులు అరెస్ట్..

మొదట, ఇరుగుపొరుగువారు ఈ దృశ్యాన్ని చూశారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో పరుగు పరుగున వచ్చిన వారు ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయారు. షాక్‌ నుంచి తేరుకున్న తరువాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. ప్రాథమిక విచారణలో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైందని ఓ అధికారి తెలిపారు.

అయితే, ఈ కేసులో అనుమానితులెవరూ లేనందువల్ల దీన్ని బ్లైండ్ కేసుగా ప్రారంభించారు. దీనికోసం పోలీసులు స్థానికులను ప్రశ్నించారు. వీరిలో చాలామంది పొరుగున ఉన్న 17 ఏళ్ల యువకుడి  ఃమీద అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతను నేరం అంగీకరించినట్లు తెలిపారు. బాలుడి వాంగ్మూలం ప్రకారం, అతను అత్యాచారం చేసిన తర్వాత చిన్నారిని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన గురించి పోలీసులకు చెబుతుందని భయపడ్డాడు.  అందుకే హత్య చేశాడు. 

ఆమె చున్నీతోనే ఆమెకు ఉరివేసినట్లు బాలుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఉరిపడి ఉంటుందనుకోవడానికి వీలుగా.. వేలాడుతున్న మృతదేహం పక్కనే కుర్చీని చక్కగా సెట్ చేశాడు. సంవత్సరం వయసున్న చిన్నారిని చూసుకుంటూ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. హత్యాచారం అనంతరం బాలుడు యేడాది చిన్నారిని నేలమీద పడుకోబెట్టాడు.

ఆ చిన్నారి ఏడుపులతోనే ఇరుగు, పొరుగు వారు అప్రమత్తం అయ్యారు. హత్యాచారం తరువాత బాలుడు టెర్రస్ మీదినుంచి తన ఇంట్లోకి వెళ్లిపోవడంతో అక్కడ ఎవరూ వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు. తాళం వేసున్న ఇంట్లోనుంచి పసిదాని ఏడుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు గుమిగూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు విచారణలో ఆ బాలుడు.. తాను పోర్న్ చూడడానికి బానిసవ్వడం వల్లే ఇది చేశానని ఒప్పుకున్నాడు. అత్యాచారం, హత్య చేయడానికి ముందు కూడా తాను పోర్న్ చూశానని అంగీకరించాడు.  

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు, గోప్యతను కాపాడేందుకు బాధితురాలి పేరు వెల్లడి చేయలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios