తోడికోడళ్లు తరచూ గొడవ పడుతున్నారని విసుగు చెందిన మామ.. క్షణికావేశంలో ఒకరి తలనరికాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. నిందితుడు పోలీసు స్టేషన్ కు వెళ్లి నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వృద్ధుడు తన కోడలి తల నరికి చంపాడు. అనంతరం రక్తపు చేతులోనే పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ చేసిన నేరం ఒప్పుకొని లొంగిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి భర్త ఓ పోలీసు కానిస్టేబుల్. ఈ ఘటన జరిగిన సమయంలో అతడు విధుల్లో వేరే ప్రాంతంలో ఉన్నాడు. 

అన్ని మసీదులను భజరంగ్ దళ్ ఆఫీసులుగా మారుస్తాం -మధ్యప్రదేశ్ లో హిందూ జాగరణ్ యాత్ర హెచ్చరిక.. వీడియో వైరల్

‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రా జిల్లాలోని కిరావలి పోలీస్ పరిధిలోని మాలిక్ పూర్ గ్రామంలో రఘువీర్ సింగ్ తన కుటుంబంతో కలిసి నివసించేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు గౌరవ్ సింగ్ పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. ఆయనకు 28 ఏళ్ల భార్య ప్రియాంక సింగ్ ఉంది. వీరిద్దరూ తండ్రితో పాటే ఒకే ఇంట్లో ఉంటున్నారు. రఘువీర్ సింగ్ పెద్ద కుమారుడు కొంత కాలం కిందట చనిపోయాడు. అతడి భార్య కూడా ఈ కుటుంబంతో కలిసే ఒకే దగ్గర జీవిస్తోంది.

హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కెనడా.. అదేంటంటే ?

అయితే కొంత కాలం నుంచి ఈ ఇద్దరు తోడి కోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి కూడా ఆ కోడళ్ల మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్ర వాగ్వాదంగా మారింది. దీనిని ఆపేందుకు రఘువీర్ సింగ్ ప్రయత్నించారు. ఆ గొడవలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కోడలు ప్రియాంక అతడిని తన్నింది. దీంతో ఆయన కింద పడిపోయాడు. 

ఈ పరిణామంతో అతడు కోపోద్రిక్తుడు అయ్యాడు. వెంటనే ఇంట్లో ఉన్న గొడ్డలితో తలనరికేశాడు. అనంతరం రక్తపు చేతులతోనే రఘువీర్ సింగ్ కిరావలి పోలీసు స్టేషన్ కు వెళ్లాడు. జరిగిన విషయమంతా చెప్పాడు. నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయాడు. ఈ ఘటన జరిగిన సమయలో కానిస్టేబుల్ అయిన రెండో కుమారుడు గౌరవ్ సింగ్ ఇంట్లో లేరని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సోనమ్ కుమార్ తెలిపారు.

మంచి దొంగలు.. జేబులో రూ.20 నోటు మాత్రమే దొరకడంతో దంపతులకే డబ్బులిచ్చి, స్కూటీపై పరారీ.. వీడియో వైరల్

ఈ ఘటనపై నిందితుడు మాట్లాడుతూ.. ఇద్దరు కోడళ్లను కలిపి ఉంచాలని తాను అనుకున్నానని తెలపారు. కానీ వారి మధ్య తరచూ గొడవలు జరిగేవని చెప్పారు. ఈ క్రమంలో సోమవారం గొడవ చేసుకుందని క్షణికావేశంలో ఈ దారుణానికి పాల్పడ్డానని తెలిపారు. కిరావలి ఎస్హెచ్ఓ ఉపేంద్ర కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘‘నిందితుడి కుమారుడు పోలీసు కానిస్టేబుల్, సంఘటన జరిగిన సమయంలో ఫరూఖాబాద్ లో విధుల్లో ఉన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రఘువీర్ తో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం’’ అని చెప్పారు. కాగా.. మృతురాలి భర్త గౌరవ్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 120-బి (నేరపూరిత కుట్ర), 34 (ఉమ్మడి ఉద్దేశ్యంతో పలువురు వ్యక్తులు చేసిన పనులు) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ వో శ్రీవాస్తవ తెలిపారు.